పాన్‌ వరల్డ్‌ చిత్రంగా ‘ది గార్డ్ 2020’ | Sakshi
Sakshi News home page

పాన్‌ వరల్డ్‌ చిత్రంగా ‘ది గార్డ్ 2020’

Published Sun, May 8 2022 3:34 PM

Guard 2020 Movie Latest Update - Sakshi

వీరాజ్ రెడ్డి చేలం హీరోగా, జగ పెద్ది దర్శకత్వంలో, అనసూయ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గార్డ్ 2020. ఈ సినిమా మొత్తం విదేశాల్లో నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా. అలాగే ఇది కేవలం పాన్ ఇండియానే కాకుండా పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనిని పూర్తిగా మెల్‌బోర్న్‌లో హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చిత్రీకరించామని మేకర్స్‌ తెలిపారు. 

ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసే సన్నివేశాలతో అద్భుతమైన టెక్నోలజీతో పూర్తిస్థాయి థ్రిల్లర్ సినిమాగా చిత్రీకరించారట. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ భాషలలో కూడా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

 ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మార్క్ కెనిఫిల్డ్ చాలా చక్కటి విజువల్స్ తో పాటు అత్యాధునిక టెక్నలాజిని ఈ సినిమాలో వాడి ప్రేక్షకులను అబ్బురపరిచే సన్నివేశాలను చిత్రీకరించారని చిత్ర యూనిట్‌ తెలిపింది. స్టంట్ డైరెక్టర్ పువెన్ పాంథర్ ఈ సినిమాకు తన నైపుణ్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టంట్స్ తో అత్యంత సాహసవంతమైన పోరాట సన్నివేశాలను కంపోజ్ చేశారన్నారు. అలాగే ఈ సినిమాకు వీఎఫ్ ఎక్స్ చాలా కీలకం. దీనికి గాను  షే  శాలిత్ హాలీవుడ్ సినిమాలో వాడే కొత్త టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది.సినిమాలో ప్రతీ సన్నివేశం అంత అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement