‘జెట్టి’లోని కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి: గోపిచంద్‌ మలినేని

Gopichand Malineni Launches Jetty Movie Trailer - Sakshi

మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం జెట్టి. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించగా వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని ‘వీరాసింహారెడ్డి’ సెట్స్‌లో లాంచ్‌ చేశాడు. 

ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. జెట్టి ట్రైలర్ లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది.  ఈ కథలో మట్టివాసనలు తెలుస్తున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో పరిచయం అవుతన్న హీరో కృష్ణకు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా అభినందనలు’ అన్నారు.

హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ.. మత్య్స కారుల జీవితాలను ఆవిష్కరించిన ఈ సినిమా లో అందమైన ప్రేమకథతో పాటు తండ్రి కూతుళ్ళ మధ్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నందిత శ్వేత గారితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.  దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఈ కథను మలిచిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది’ అన్నారు.

‘తీర ప్రాంతం లో ఒక జీవిన విధానం ఉంటుంది. వారి సమస్యలు కట్టుబాట్లు చాలా పటిష్టంగా ఉంటాయి.  అలాంటి నేపథ్యం లో తీసిన జెట్టి కథ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందింస్తుంది’ అని దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక  అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top