breaking news
Jetty Movie
-
యానంలో ‘జెట్టి’ హీరో సందడి
‘జెట్టి’సినిమా హీరో మాన్యం కృష్ణ యానంలో సందడి చేశాడు. ఈ శుక్రవారం ఉదయం ఆటకు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుతో ప్రేక్షకుల సమక్షంలో సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇటువంటి కథ లు తెరమీద కు తీసుకురావడం చాలా కష్టం. ఈ ప్రయత్నం చేసిన టీమ్ ని అభినందిస్తున్నాను. ఈ కథ లో చూపిన సమస్యలు చాలా మందికి బాధ్యతలను గుర్తు చేస్తాయి. ఈ సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ.. ‘జెట్టి సినిమా ని ఆదరిస్తున్న యానం ప్రాంత వాసులకు కృతజ్ఞతలు. తీర ప్రాంతాలలో జెట్టి సినిమా ఆదరణ పెరుగుతుంది. షోలు కూడా పెరుగుతుండటం చాలా ఆనందం గా ఉంది. మల్లాడి కృష్ణ రావు గారికి కృతజ్ఞతలు.మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ దక్కుతున్నందుకు ఆనందం గా ఉంది’అన్నారు. -
Jetty Review: ‘జెట్టి’ మూవీ రివ్యూ
టైటిల్: జెట్టి నటీనటులు: మాన్యం కృష్ణ, నందిత శ్వేతా, తేజశ్వని బెహెర, ఎంఎస్ చౌదరి, జి.కిశోర్, గోపి, జీవ, శివాజీ రాజా, సుమన్ శెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: వర్థని ప్రొడక్షన్స్ నిర్మాతలు: కే వేణు మాధవ్ దర్శకత్వం: సుబ్రహ్మణ్యం పిచ్చుక సంగీతం: కార్తీక్ కొడకండ్ల విడుదల తేది: నవంబర్ 04, 2022 కథేంటంటే... కటారిపాలెం గ్రామ ప్రజలకు కట్టుబాట్లు ఎక్కువ. ఆ కట్టుబాట్లను ఊరి పెద్ద జాలయ్య(ఎంఎస్ చౌదరి)పరిరక్షిస్తూ.. ఆ ఊరికి, అక్కడ ఉన్నా చుట్టూ పక్కల ప్రాంతానికి పెద్ద కాపుగా ఉంటారు.తరచూ గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్స్ తుపానుల తాకిడికి కొట్టుకు పోయి నష్టాలను తెస్తుంటాయి. దాంతో ఎలాగైనా జెట్టి నిర్మించి మత్స్య కారులను ఆదుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే అయిన దశరథ రామయ్య(శివాజీ రాజా)కి మొరపెట్టుకుంటారు. అయితే అతను ప్రతి పక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కావడంతో తానూ జెట్టిని కట్టలేనని చేతులెత్తేస్తాడు. అయితే ఈ జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని విలన్ (మైమ్ గోపి ) అడ్డు తగులుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్రామానికి ఉపాధ్యాయినిగా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ... జాలయ్య కూతురు మీనాక్షి( నందిత శ్వేత) ప్రేమలో పడతారు. వీరిరువురు ఓ రోజు గ్రామ వదిలి వెళ్ళిపోతారు. దాంతో ఆ ఊరి సంస్కృతి సంప్రదాయం, కట్టు బాట్ల ప్రకారం జాలయ్య అవమానంగా ఫీల్ అవుతాడు. మరి జాలయ్య ఓ వైపు తనని నమ్ముకున్న మత్స్య కారులకి జెట్టిని ప్రభుత్వం నుంచి సాధించుకున్నారా? అలాగే ఊరి కట్టుబాట్లని లెక్క చేయకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన తనకూతురుని ఎం చేసాడు అనేదే జెట్టి మిగతా కథ. ఎలా ఉందంటే.. వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, వాళ్ళ జీవితాల కోసం చేసే పోరాటమే జెట్టి సినిమా. ప్రపంచానికి మారుమూల బ్రతికే మత్స్యకారుల కఠినమైన కట్టుబాట్లు, వారి జీవనశైలి, మత్స్యకారులు పోరాటం చేసి జెట్టిని ఎలా సాధించారు అన్నదే ఈ సినిమా కథాంశం. సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో దర్శకుడు తీరా ప్రాంతంలో ఉన్న కటారి పాలెం అనే ఓ గ్రామాన్ని తీసుకొని... ఆ ప్రాంతం, దాని చుట్టూ పక్కల ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా కథ నాన్ని రాసుకుని వెండితెరపై మత్స్య కారుల జీవితాన్ని ఆవిష్కరించారు. (చదవండి: ‘ఊర్వశివో రాక్షసివో మూవీ రివ్యూ) అలానే మత్స్య కారులని దోచుకునే ఓ మోతుబరి ఆ ప్రాంతాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న కథ, కథనాలు ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ఇందులో ఎంతో భావోద్వేగం ఉంటుంది. కూతుళ్ల మధ్య ఉండే ఓ ఎమోషనల్ బాండింగ్ క్లైమాక్స్ లో కంటతడి పెట్టిస్తుంది. ఆ ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది. జెట్టి సినిమా గుండెను బరువెక్కించే సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి బాగా క్యారీ చేశారు. తన్ని నమ్ముకున్న వారికి ఓ గ్రామ పెద్దగా ఎలా సహాయం చేయాలనే పాత్రని బాగా పండించారు. హీరోగా నటించిన కృష్ణ మాన్యం... స్కూల్ టీచర్ పాత్రలోను ... గ్రామాభివృద్ధికి పాటు పడే మంచి యువ ఉపాధ్యాయ పాత్రలో చక్కగా ఒదిగి పోయారు. హీరో కటౌట్ కూడా ఆరడుగులు పైనే ఉండటంతో యాక్షన్ సీన్స్ లోను మెప్పిచారు. అతనికి జోడిగా నటించిన నందిత శ్వేత పైగా గ్రామీణ యువతిగా, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారిణిగా చక్కగా నటించారు. విలన్ గా మైమ్ గోపి రౌద్రం పండించారు. పొలిటీషియన్ పాత్రలో శివాజీ రాజా పర్వాలేదు అనిపించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాట బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘జెట్టి’లోని కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి: గోపిచంద్ మలినేని
మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం జెట్టి. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించగా వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ‘వీరాసింహారెడ్డి’ సెట్స్‌లో లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. జెట్టి ట్రైలర్ లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది. ఈ కథలో మట్టివాసనలు తెలుస్తున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో పరిచయం అవుతన్న హీరో కృష్ణకు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా అభినందనలు’ అన్నారు. హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ.. మత్య్స కారుల జీవితాలను ఆవిష్కరించిన ఈ సినిమా లో అందమైన ప్రేమకథతో పాటు తండ్రి కూతుళ్ళ మధ్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నందిత శ్వేత గారితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఈ కథను మలిచిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది’ అన్నారు. ‘తీర ప్రాంతం లో ఒక జీవిన విధానం ఉంటుంది. వారి సమస్యలు కట్టుబాట్లు చాలా పటిష్టంగా ఉంటాయి. అలాంటి నేపథ్యం లో తీసిన జెట్టి కథ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందింస్తుంది’ అని దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక అన్నారు.