నెగటివ్‌ రోల్స్‌ చేయను: గాడ్సే హీరోయిన్‌ | Godse Heroine Aishwarya lekshmi Comments On Movie Promotion | Sakshi
Sakshi News home page

Godse Heroine: నెగటివ్‌ రోల్స్‌ చేయను

Published Sun, Jun 12 2022 8:12 AM | Last Updated on Sun, Jun 12 2022 8:12 AM

Godse Heroine Aishwarya lekshmi Comments On Movie Promotion - Sakshi

‘‘ఓ నటిగా విభిన్న పాత్రలు చేసేందుకు సిద్ధం. నేను నటించే పాత్రను త్వరగా అర్థం చేసుకుని వెంటనే ఆ పాత్రలోకి వెళ్లిపోగలను. అయితే ఇప్పుడే నెగటివ్‌ రోల్స్‌ మాత్రం చేయాలనుకోవడం లేదు. ఇంటెన్స్‌ అండ్‌ యాక్షన్‌ రోల్స్‌ చేయడానికి సిద్ధమే’’ అన్నారు హీరోయిన్‌ ఐశ్వర్యాలక్ష్మీ. సత్యదేవ్‌ హీరోగా గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్సే’. సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యాలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘గాడ్సే’ చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌కి రావడం సంతోషంగా ఉంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే ఓ వ్యక్తి కథే ఈ చిత్రం.

ప్రభుత్వంతో పౌరులకు ఎలాంటి రిలేషన్‌షిప్‌ ఉండాలి? వ్యవస్థలోని లోపాలపై ఓ యువకుడు ఎలా రియాక్ట్‌ అయ్యాడు? అనే అంశాల నేపథ్యంలో ‘గాడ్సే’ కథ సాగుతుంది. ఇందులో వైశాలి అనే సీరియస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటించాను. బ్యూటీ అండ్‌ బ్రెయిన్‌.. ఈ రెండూ ఉపయోగించే పాత్ర నాది. సత్యదేవ్‌ ఇంటెన్స్‌ అండ్‌ అమేజింగ్‌ యాక్టర్‌. తన నటనలో నిజాయితీ కనిపిస్తుంది. సి.కల్యాణ్‌గారు మంచి అభిరుచి గల నిర్మాత. గోపీ గణేష్‌గారు నన్ను నమ్మడంతో సెట్స్‌లో టెన్షన్‌లో లేకుండా నటించాను. మణిరత్నంగారి దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో కీలక పాత్ర చేశాను. మరో నాలుగు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. సాయిపల్లవి చేస్తున్న ‘గార్గి’కి ఓ నిర్మాతగా ఉన్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement