‘ది టర్న్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల

Gautham Raju Son Krishna The Turn Movie First Glimpse Out - Sakshi

ప్రముఖ హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  ‘ది టర్న్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మనోహర్ వల్లెపు, లడ్డు, అరుణ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసంతి, రత్నమాల ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కౌశల్ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై డీబీ దొరబాబు దర్శకత్వంలో భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆర్‌ సారథీ సంగీతం సమకూరుస్తుండగా ప్రదీప్ జంబిగా ఎడిటింగ్ అందిస్తున్నారు. విజయ్ ఠాగూర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి ఆయన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా ఈరోజు హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేసింది చిత్ర బృందం. 

ఈ సందర్భంగా  నిర్మాత భీమినేని శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ది టర్న్ సినిమా కథ చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మెచ్చే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. మా హీరో కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయన నటన చాలా బాగుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top