'రాననుకున్నారా.. రాలేననుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్‌ కృష్ణ! | Gautham Krishna Comes Out From Secret Room After Elimination, Comments On Housemates Goes Viral - Sakshi
Sakshi News home page

Gautham Krishna: 'తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా'.. గౌతమ్ కృష్ణ ఆగ్రహం!

Published Tue, Oct 10 2023 3:28 PM

Gautham Krishna Comes Out From Secret Room After Elimination - Sakshi

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0. ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్‌తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్‌బాస్‌ రోజుకు ఒక షాక్ ఇస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్‌ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ ఎలిమినేట్ కావొచ్చని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. శుభశ్రీ హౌస్‌ నుంచి ఎలిమినేట్ కాగా.. గౌతమ్‌ను సీక్రెట్‌ రూమ్‌లోకి పంపి బిగ్ షాకిచ్చారు బిగ్ బాస్. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజైంది. ఈ ప్రోమోలో గౌతమ్‌ కృష్ణ సీక్రెట్ రూమ్ నుంచి బయటికొచ్చేశాడు. 

(ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి యత్నించారు: శుభ శ్రీ)

బయటకు వస్తూనే గౌతమ్ మాట్లాడుతూ..'రాననుకున్నారా.. రాలేననుకున్నారా? అంటూ సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న గౌతమ్ ఎంతో ఆవేశంతో బయటకొచ్చాడు. అశ్వత్థామ ఇజ్‌ బ్యాక్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు.  'తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా.. అయినా ఈ అశ్వత్థామ చావడు. ఎలా వెళ్లానో అలానే వచ్చా. దిస్ ఇజ్ 2.0 బేబీ' అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే గౌతమ్‌ కృష్ణ మాటలు చూసి కంటెస్టెంట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. 

ఆ తర్వాత శివాజీనీ ఉద్దేశించి మాట్లాడారు. అన్న మీరు నన్ను ఎంటర్‌టైన్‌ చేయలేడేమో అన్నారు కదా? అని గౌతమ్ చెప్పడంతో.. తమ్ముడు ముందు నీ రీజన్ చెప్పు అంటూ శివాజీ అన్నారు. 'ఎంటర్‌టైన్‌ చేయడమంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కదన్నా.. కవర్‌ను చూసి బుక్‌ను జడ్జ్ చేయొద్దన్నారు అన్నా' గౌతమ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. 'బట్టలిప్పడం ఎంటర్‌టైన్‌మెంటా? అని ఇంతమంది ముందు అన్నావ్. 100 సినిమాల్లో చేశా బట్టలు లేకుండా.. నేను ఒక నటుడిని.. ఏమైనా చేస్తా' అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ వెంటనే గౌతమ్‌.. నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను.. దీన్ని ఊపయోగించి నువ్వు ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చు' అని ఆప్షన్ ఇచ్చాడు. దీంతో గౌతమ్‌ ఎవరినీ నామినేట్ చేయాలనుకున్నాడో చెప్పేలోగా ప్రోమో ముగిసింది.

గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయనున్నాడో ఇవాళ ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో క్లారిటీ రానుంది. సీక్రెట్‌లో రూమ్‌లో ఉన్న గౌతమ్‌కు బయటకు రావడం, స్పెషల్ పవర్ ఇవ్వడం ఈ ఎపిసోడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా.. ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్‌దీప్‌, సందీప్‌, ప్రిన్స్‌ యావర్‌ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: నామినేషన్స్‌లో ట్విస్ట్‌.. కొత్తవాళ్లకే ఛాన్స్‌! ఒక్కొక్కరికీ ఉంటదీ..)

Advertisement
 
Advertisement