హనీమూన్‌కు వెళ్లిన బిగ్‌బాస్‌ నటి

Gauahar Khan Enjoy Honeymoon With Zaid Darbar in Udaipur - Sakshi

ఉదయ్‌పూర్‌: బాలీవుడ్‌ నటి గౌహర్‌ ఖాన్‌- కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ ఇటీవలే పెళ్లి చేసుకుని వివాహ బంధానికి ఆరంభం పలికారు. డిసెంబర్‌ 25న షాదీ జరపుకున్న ఈ జంట తాజాగా హనీమూన్‌కు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లింది. తొలిసారి భర్తతో కలిసి ప్రయాణం చేసినందుకు గౌహర్‌కు గాల్లో తేలినట్లుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంటూ 'నేను నా భర్తతో కలిసి వెళ్తున్న ఫస్ట్‌ హాలీడే ఇది. చాలా హ్యాపీగా ఉంది' అంటూ వీడియోను షేర్‌ చేశారు. ఇందులో గౌహర్‌ ఎక్కడలేని ఆనందంతో స్టెప్పులేస్తున్నారు. భర్తతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను సైతం పోస్ట్‌ చేశారు. కాగా మాజీ మోడల్‌ అయిన గౌహర్‌ అనేక టీవీ షోలలో కనిపించారు. హిందీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొని విజేతగా అవతరించిన ఆమె 14వ సీజన్‌లోనూ హౌస్‌లోకి వెళ్లి వచ్చారు. ఇటీవలే ఆమె తాండవ్‌ వెబ్‌ సిరీస్‌లో నటించగా దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటించారు. (చదవండి: ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి)

ఇక జైద్‌ దర్బార్‌ విషయానికి వస్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇస్మాయిల్‌ దర్బార్‌ కుమారుడు అయిన జైద్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. కాగా గౌహర్‌కు, జైద్‌కు ఎనిమిదేళ్ల వ్యత్యాసం ఉంది. కానీ ప్రేమకు వయసుతో పని లేదని, ఇద్దరం పరిణతి చెందినవారమని, ఒకరికొకరం బాగా అర్థం చేసుకోగలమంటూ పెళ్లి చేసుకుని నిరూపించారు. (చదవండి: అలనాటి స్టార్‌ హీరో బ్రేకప్‌ స్టోరీ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top