Vishal : విశాల్‌ పాన్‌ ఇండియా చిత్రం "మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ రిలీజ్

First Look Of Vishal Pan India Movie Mark Antony Unveiled - Sakshi

వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం "మార్క్ ఆంటోనీ". మినీ స్టూడియోస్ పతాకంపై  రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ నటీ నటులుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్  గా ఉండబోతుంది. దర్శకుడు ఎస్ జే సూర్య  ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో  ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే  సందర్బంగా "మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ  మేకర్స్. ఇందులో  హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్  చేస్తున్నట్లు చాలా పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top