పాల్‌ వాకర్‌ కూతురి పెళ్లిలో తండ్రిలా వ్యవహరించిన విన్‌ డిజిల్‌

Fast and Furious Star Vin Diesel Walked Paul Walkers Daughter Down Aisle At Her Wedding - Sakshi

‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇందులో యాక్టర్స్‌ చేసే సాహసాలు రొమాలు నిక్కబోడిచేలా ఉండడంతో.. ఈ సిరీస్‌లో భారీ స్టాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించి వరల్డ్‌ వైడ్‌ పాపులారిటీ సంపాదించుకున్నారు విన్‌ డీజిల్‌, పాల్‌ వాకర్‌.

గత కొన్ని సంవత్సరాల క్రితం పాల్‌ వాకర్‌ ఓ యాక్సిడెంట్‌లో మరణించాడు. అయితే తాజాగా ఆ నటుడిక కూతురు మోడల్ మెడో వాకర్ (22) వివాహం జరిగింది. ఈ పెళ్లికి పాల్‌తో దాదాపు 6 సినిమాల్లో కలిసి నటించిన విన్‌ డిజిల్‌ హాజరయ్యాడు. అంతేకాకుండా పెళ్లి కూతురిని డయాస్‌ వరకూ తీసుకొచ్చాడు విన్‌.

నిజానికి అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురిని అలా ఆమె తండ్రి తీసుకొస్తాడు. అయితే పాల్‌ లేని కారణంగా.. ఈ దివంగత నటుడిపై ఉన్న అభిమానంతో విన్‌ ఆయన కూతురిని పెళ్లి కూతురిలా వేదిక వరకూ తీసుకురావడం ఎంతోమంది అభిమానులు మనసులను గెలుచుకుంది. అంతే కాకుండా దీనిపై ఎంతో మంది హాలీవుడ్‌ స్టార్స్‌​ స్పందించారు. ఈ వివాహానికి సంబంధించి వీడియోని, ఫోటోలని మెడో వాకర్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో అవి వైరల్‌గా మారాయి.

చదవండి: అబార్షన్‌ చేయించుకొమన్నందుకు.. మాజీ ప్రియురాలికి క్షమాపణలు తెలిపిన నటుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top