అరె.. ఏంట్రా ఇదీ.. మరీ ఓవర్‌గా లేదూ..! | Sakshi
Sakshi News home page

స్టేజీపై హీరోయిన్‌కు హారతి.. వామ్మో.. బానే ఎక్స్‌ట్రాలు కొడ్తున్నాడే!

Published Sat, Mar 16 2024 6:21 PM

Fan Gives Harathi To Malayalam Actress Mamitha Baiju In Premalu Success Meet; Video Viral - Sakshi

ఈ మధ్య జనాలకు పిచ్చి ముదురుతోంది. అందుకు ఇప్పుడు చెప్పుకునే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రేమలు అనే మూవీ మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇంకేముంది.. ఈ చిత్రాన్ని వెంటనే తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దీనికి మంచి స్పందన లభించింది. సినిమా క్లిక్‌ అవడంతో హీరోయిన్‌ మమిత బైజుకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేస్తుండగా మరో సినిమాకు ఓకే చెప్పేసిందట!

ఇకపోతే హైదరాబాద్‌లో జరిగిన ప్రేమలు సక్సెస్‌మీట్‌లో ఓ మీమర్‌ అతి చేశాడు. సినిమా చూసి పెద్ద అభిమాని అయిపోయానంటూ స్టేజీపైనే మమితకు హారతి ఇచ్చాడు. ఈ రకమైన అభిమానం తొలిసారి చూస్తున్నానంటూ నవ్వేసింది హీరోయిన్‌. అయితే ఇది చూసిన జనాలు మాత్రం.. కాస్త కాదు.. చాలా అతిగా ఉందని ట్రోల్‌ చేస్తున్నారు.

ఒక్క సినిమాకే గుండెలో గుడి కట్టేశావా? పైగా హారతి కూడా రెడీ చేసుకున్నావంటే ముందే అంతా ప్లాన్‌ చేసుకున్నట్లేగా.. ఎందుకింత ఓవరాక్షనో.. మరీ జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు.. ఫేమస్‌ అవడానికి ఇలాంటి డ్రామాలు చేయడం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. కొందరు మాత్రం మా హీరోయిన్‌ ఎంత క్యూట్‌గా నవ్వుతుందో.. ఇంతటి గ్రాండ్‌ వెల్‌కమ్‌ మరెవరికీ దక్కలేదని మురిసిపోతున్నారు మమిత ఫ్యాన్స్‌.

చదవండి:  జీవితం ఎటు పోతోందో.. హృదయం ముక్కలయ్యాక..

Advertisement
 
Advertisement
 
Advertisement