డైరెక్ట‌ర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామ‌య్య‌ను మండ‌పానికి రానివ్వ‌లేద‌ట‌! | Do You Guess This Tollywood Top Heroine? | Sakshi
Sakshi News home page

తెలుగులో స్టార్ హీరోయిన్‌.. ఎవరో గుర్తుప‌ట్టారా?

May 6 2024 4:38 PM | Updated on May 6 2024 4:52 PM

Do You Guess This Tollywood Top Heroine?

త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాత‌గా మారింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లినాటి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకుంది. కొన్నిచోట్ల మామ‌య్యే పెళ్లికూతుర్ని మండ‌పానికి తీసుకెళ్తుంటాడు.

అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు.. అవి మ‌న‌సులైనా, మ‌నుషులైనా! ఒక‌ప్పుడు అందంతో, న‌ట‌న‌తో ఊద‌ర‌గొట్టిన ఎంతోమంది తార‌లు ఇప్పుడు గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయారు. పైన క‌నిపిస్తున్న న‌టి కూడా ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌. ఆమె తండ్రి గౌరీశంకర్ ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్‌.. త‌ల్లి మ‌మ‌తా రావ్‌ క‌న్న‌డ‌లో హీరోయిన్‌. సినీ బ్యాక్‌గ్రౌండ్ బాగానే ఉన్న ఈమెను ఇప్ప‌టికైనా గుర్తుప‌ట్టారా? త‌న పేరు ర‌క్షిత‌.

తొలి చిత్రంతోనే హిట్
2002లో అప్పు సినిమాతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ఇడియ‌ట్‌గా, త‌మిళంలో ధ‌మ్‌గా రీమేక్ చేశారు. ఈ రెండుచోట్లా రక్షితే క‌థానాయిక‌. ఈ మూవీ విజ‌యం సాధించ‌డంతో తెలుగులో పెళ్లాం ఊరెళితే.., నిజం, శివ‌మ‌ణి, ఆంధ్రావాలా, అంద‌రివాడు.. ఇలా అనేక సినిమాల్లో న‌టించింది.

సినిమాల‌కు గుడ్‌బై
క‌న్న‌డ‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. 2007లో క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్రేమ్‌ను పెళ్లి చేసుకుంది. త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాత‌గా మారింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లినాటి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకుంది. 'కొన్నిచోట్ల మామ‌య్యే పెళ్లికూతుర్ని మండ‌పానికి తీసుకెళ్తుంటాడు. అలా న‌న్ను కూడా మా మామ‌య్య తీసుకెళ్లాల్సి ఉంది. ఆ రోజు అంతా రెడీ అయ్యాం.

నో ఎంట్రీ
స‌మ‌యానికి ఆయ‌న క‌నిపించ‌లేదు. తీరా ఆయ‌న బ‌య‌ట ఏదో ప‌నిమీద వెళ్లాడ‌ని తెలిసింది. తిరిగి వ‌చ్చేట‌ప్పుడు సెక్యూరిటీ గార్డులు ఆయ‌న్ను లోనికి అనుమ‌తించ‌లేదు. నేను ఆమె మామ‌య్య‌ను.. వెళ్ల‌నివ్వండి అని చెబుతున్నా వాళ్లు వినిపించుకోలేదు. ఆయ‌న ఎలాగోలా లోప‌లికి వ‌చ్చేసరికే పెళ్లి తంతు దాదాపు పూర్త‌యింది. ఇప్ప‌టికీ ఇది గుర్తు చేసుకుని న‌వ్వుకుంటుంటాం' అని ర‌క్షిత‌ చెప్పుకొచ్చింది.

చ‌ద‌వండి: ఆ వివాదంతో వార్త‌ల్లో.. గుడ్‌న్యూస్ చెప్పిన సీరియ‌ల్ జంట‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement