తొలి పారితోషికంతో ఎన్టీఆర్‌ ఏం చేశాడంటే..

Did You Know Jr NTR Remuneration For His Debut Film Ninnu Choodalani  - Sakshi

'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్‌ ఎ‍న్టీఆర్‌. 17ఏళ్ల వయసులో  హీరోగా ఎన్టీఆర్‌  చేసిన తొలి సినిమా అది. అప్పటికే బాల రామాయణం సినిమాతో చెల్డ్‌ ఆర్టిస్టుగా పరిచయం అయ్యి ప్రశంసలు దక్కించుకున్నాడు ఎన్టీఆర్‌. ఇక హీరోగా ఎన్టీఆర్‌ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో 2001 విడుదలైన ఈ సినిమా ఇటీవలె 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరలవుతుంది. హీరోగా చేసిన తొలి సినిమాకు ఎన్టీఆర్‌ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలా హల్‌చల్‌ చేస్తుంది.

'నిన్ను చూడాలని' సినిమాకు గాను ఎన్టీఆర్‌ అక్షరాలా 4 లక్షల రూపాయల  రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. తొలి పారితోషికం అందుకున్న వెంటనే ఎన్టీఆర్‌ ఆ డబ్బును తల్లికి ఇచ్చి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక నిన్ను చూడాలని సినిమా అనంతరం రెండేళ్లలోనే స్టూడెంట్ నెం 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్‌’లో తారక్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అనంతరం 'కేజీఎఫ్‌’ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అనంతరం ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సానా డైరెక్షన్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి : RRR Movie: ఫైట్‌ సీన్‌కి కన్నీళ్లొస్తాయి! 
'తగ్గేదే లే'.. అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top