Devatha :కనకం చెంప పగలకొట్టిన దేవుడమ్మ | Devatha Serial: Devudamma Slapes Kanakam | Sakshi
Sakshi News home page

Devatha :కనకం చెంప పగలకొట్టిన దేవుడమ్మ

Jun 21 2021 3:19 PM | Updated on Jun 21 2021 3:25 PM

Devatha Serial: Devudamma Slapes Kanakam - Sakshi

రుక్మిణి- సత్యల మోసం గురించి దేవుడమ్మకు చెప్పాలని కనకం తెగా హడావిడి చేస్తుంది. అయితే అక్కడ సీన్‌  రివర్స్‌ కావడంతో బిక్కమొఖం వేసుకుంటుంది. అయినా తను చెప్పిందే నిజం అన్నట్లు వాదిస్తుంది. ఆ మాటల్లోనే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆదేత్య తండ్రి అని చెప్పడంతో దేవుడమ్మ కనకం చెంప చెళ్లుమనిపిస్తుంది. తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినందుకు కనకంను ఇంట్లోంచి గెంటివేస్తుంది. ఇలాంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌ 21న 265వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

రుక్మిణి స్థానంలో సత్య వ్రతం చేయడాన్ని చూసి కనకం ఆశ్చర్యపోతుంది. ఈ విషయాన్ని దేవుడమ్మకు చెప్పాలని తెగ ఆరాటపడుతుంది. వెంటనే దేవుడమ్మను పిలిచి సత్య చేస్తున్న వ్రతం గురించి వివరిస్తుంది. కావాలంటే అక్కడికే వెళ్లి చూద్దామని చెప్తుంది. అయితే సరిగ్గా దేవుడమ్మ వచ్చే సమయానికి సీన్‌ రివర్స్‌ అవుతుంది. సత్య స్థానంలో  రుక్మిణి  పూజ చేస్తుంటుంది. దీంతో కనకంకు దిమ్మతిరిగిపోయింది. వీళ్లు కావాలని ఇలా చేస్తున్నారని, కావాలంటే పంతులును అడగాలని చెప్తుంది. అయితే ఆయన కూడా ప్లేటు మార్చేసి రుక్మిణికే అండగా నిలుస్తారు. దీంతో దేవుడమ్మ కనకంను తిట్టి పోస్తుంది.

అయితే ఇందులో తన తప్పేమీ లేదని, అసలు సత్య కడుపులో పెరుగుతుంది ఆదిత్య బిడ్డే అన్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్తుంది. దీంతో దేవుడమ్మ కనకం చెంప చెల్లుమనిపిస్తుంది. తన కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తుంది. అయినా కనకం మాట వినకుండా ఆదిత్యే సత్య బిడ్డకు తండ్రి అంటూ వాదిస్తుండటంతో మరోసారి కనకంపై దేవుడమ్మ చేయిచేసుకుంటుంది. తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినందుకు గానూ వెంటనే ఇంట్లోంచి వెళ్లాలని ఆదేశిస్తుంది. అయితే తన వల్ల కనకం అత్తను బయటకు పంపొద్దని రుక్మిణి వేడుకున్నా దేవుడమ్మ  అందుకు అంగీకరించదు. మరి ఇంట్లోంచి వెళ్లగొట్టినందుకు కనకం ఏం చేస్తుంది అనేది తర్వాతి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement