ప్రముఖ డ్యాన్సర్‌పై చీటింగ్‌ కేసు.. అరెస్టు వారెంట్‌ జారీ

Dancer Sapna Chaudhary In Trouble, Arrest Warrant Issued By Lucknow court  - Sakshi

ప్రముఖ డ్యాన్సర్‌ సప్నా చౌదరి వివాదంలో చిక్కుకుంది. ఒక ప్రోగ్రామ్‌ను రద్దు చేసి, టిక్కెట్ హోల్డర్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శంతను త్యాగి బుధవారం చౌదరిపై వారెంట్ జారీ చేశారు. కేసు తదుపరి విచారణ తేదీ అయిన నవంబర్ 22 లోగా దీనిని అమలు చేయాలని పోలీసులను కోరారు. సప్నా చౌదరి గతంలో కూడా ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది అయితే కోర్టు దీనిని తిరస్కరించింది.  

అసలేం జరిగిందంటే.. 2018 అక్టోబర్‌ 13న లక్నోకు చెందిన సప్నా చౌదరితో డ్యాన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె టీం డబ్బులు వసూలు చేసింది. షో తిలకించేందుకు వేలాది మంది ప్రజలు కూడా తరలివచ్చారు. అయితే ఆ రోజు చౌదరి రాత్రి 10 గంటల వరకు రాలేదు, దీంతో షో రద్దు అయ్యింది. కార్యక్రమం రద్దు కావడంతో జనం అక్కడికక్కడే తోపులాట సృష్టించారు. 

షో జరగకపోయినా యాజమాన్యం తీసుకున్న రూ.300 టికెట్‌ సొమ్మును ప్రజలకు తిరిగి ఇవ్వలేదు. దీంతో టికెట్‌ కొన్న కొందరు ఆమెపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ డ్యాన్సర్‌తో పాటు, ప్రోగ్రామ్ నిర్వాహకులు జునైద్ అహ్మద్, నవీన్ శర్మ, ఇబాద్ అలీ, అమిత్ పాండే, రత్నాకర్ ఉపాధ్యాయ్‌ల పేర్ల మీద కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

చదవండి: Repeal of farm laws:మోదీకి షాకిచ్చిన కంగనా, వివాదాస్పద వ్యాఖ్యలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top