'నువ్వు చేసింది ఉప్మా కాదు.. మర్డర్'.. ఆసక్తిగా ట్రైలర్! | Sakshi
Sakshi News home page

Currency Nagar: 'డబ్బులు మాట్లాడతాయా..కథలు కూడా చెప్తాయా'.. ఆసక్తిగా ట్రైలర్!

Published Mon, Dec 18 2023 8:55 PM

Currency Nagar Telugu Movie Trailer Released By Srikanth Addala - Sakshi

యడ్లపల్లి మహేష్, స్పందన, సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కరెన్సీ నగర్'. ఈ సినిమా ద్వారా  వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు.  ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో  తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 29న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా కరెన్సీ నగర్ ట్రైలర్ విడుదల చేశారు.

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.... 'తెలుగులో మొదటిసారిగా వస్తోన్న ఆంథాలజీ చిత్రమింది. ట్రైలర్ బాగుంది, అందరూ బాగా చేశారు. ఈ సినిమాతో దర్శకుడు వెన్నెల కుమార్‌ విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంటాడాని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నా' అని అన్నారు.

ట్రైలర్‌ చూస్తే ఈ సినిమాలో మనిషికి, మనీకి, నైతికతకు ఉండే బంధాన్ని.. నాలుగు కథల రూపంలో చక్కగా తెరకెక్కించారు.  ఈ చిత్రంలోని పాటలు, సంగీతం అందర్నీ ఆకట్టుకుంటాయని మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది.  ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని, పవన్ సంగీతమందించారు. 


Advertisement
 

తప్పక చదవండి

Advertisement