‘సినీ వరల్డ్‌’ మూత ఉద్యోగుల కోత

Cineworld To Shut Down UK Screens Thousands Of Job Risk - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో దేశవ్యాప్తంగా చెయిన్‌ 127 సినిమా థియేటర్ల నెట్‌వర్క్‌ కలిగిన ‘సినీ వరల్డ్‌’ తన కార్యకలాపాలను కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. జేమ్స్‌ బాండ్, స్టార్‌వార్స్‌ సిరీస్‌కు చెందిన తాజా చిత్రాల విడుదలపై ఆశలు పెట్టుకొని ఇంతకాలం నెట్టుకొచ్చిన ‘సినీ వరల్డ్‌’ ఆ సినిమాల విడుదల కూడా మరోసారి వాయిదా పడడంతో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. 


ఇప్పటికే 350 కోట్ల పౌండ్ల అప్పుకలిగిన ‘సినీ వరల్డ్‌’కు స్కై, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్, బ్రిట్‌ బాక్స్‌ సంస్థల నుంచి ఆన్‌లైన్‌ చిత్రాల ద్వారా గట్టి పోటీ ఏర్పడడంతో తన కార్యకలాపాలకు తెర దించాల్సి వచ్చింది. హారీ పాటర్‌ సిరీస్‌ చిత్రాలకు మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ, ఆ చిత్రాలను సినిమా థియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నప్పటికీ ఆ ఒక్క బ్రాండ్‌ చిత్రాలపై ఆధారపడి పరిశ్రమను నడిపించలేమని ‘సినీ వరల్డ్‌’ భావించింది. సినీ వరల్డ్‌ నిర్ణయం దేశవ్యాప్తంగా వారి నెట్‌ వర్క్‌లో పని చేస్తోన్న 4,500 ఉద్యోగులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడనున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top