Choreographer Rajesh Master Dies Allegedly By Suicide - Sakshi
Sakshi News home page

Rajesh Master Death: విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఆత్మహత్య

Apr 21 2023 3:03 PM | Updated on Apr 21 2023 3:12 PM

Choreographer Rajesh Master Dies Allegedly By Suicide - Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాజేష్‌ మాస్టర్‌ కన్నుమూశారు. అతనిది సహజ మరణం కాదని, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే సూసైడ్‌కు గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సౌత్‌ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాజేష్‌ మాస్టర్‌కు మంచి పేరు ఉంది. పలు సినిమాల్లో ఆయన పనిచేశారు. కాగా రాజేష్‌ మాస్టర్‌ మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్‌ మాస్టర్‌ మరణవార్త తనను షాక్‌కి గురి చేసినట్లు ప్రముఖ నటి బీనా ఆంటోనీ  ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement