జాతిరత్నాలు 'చిట్టి' సాంగ్‌కు 100 మిలియన్‌ వ్యూస్‌

Chitti Song From Jathiratnalu Hits 100 Million Views - Sakshi

Chitti Song Hits 100 Million Views: చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. నవీన్‌ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 11లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఇందులోని పాటలు కూడా బాగానే హిట్టయ్యాయి. ముఖ్యంగా 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందో నా గుండె ఖల్లాసే..' అనే పాట యువతకు బాగా కనెక్ట్‌ అయింది. మార్చి 29న రిలీజైన ఈ పాట తాజాగా 100 మిలియన్ల వ్యూస్‌ అందుకుంది. దీంతో చిట్టి సాంగ్‌ సోషల్‌ మీడియాలో మరోసారి మార్మోగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top