#CancelDobaaraa: Anurag Kashyap, Taapsee Pannu Film Wish Fulfilled - Sakshi
Sakshi News home page

#Cancel Dobaaraa: తాప్సీ మూవీని నిషేధించి, గుణపాఠం చెప్దామంటున్న నెటిజన్లు

Aug 11 2022 4:44 PM | Updated on Aug 11 2022 6:43 PM

Cancel Dobaaraa: Anurag Kashyap, Taapsee Pannu Film Wish Fulfilled - Sakshi

అయితే అన్ని బాలీవుడ్‌ సినిమాల్లాగే తమ మూవీని కూడా బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియా ఊగిపోవాలని తాప్సీ, అనురాగ్‌ కోరుకోవడం గమనార్హం. అసలు థియేటర్లలో రిలీజయ్యే అర్హత దొబారాకు లేనే లేదు, తాప్సీ ఇలాంటి సిని

సినిమా రిలీజ్‌ అవడానికంటే ముందే దాన్ని నిలిపివేయాలంటూ బాయ్‌కాట్‌ చేసే ప్రచారం ఈమధ్య పరిపాటి అయింది. బాలీవుడ్‌లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బడా హీరోల నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు దాన్ని చూడొద్దంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో నేడు రిలీజైన ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా కూడా ఉంది. తాజాగా ఇప్పుడు మరో సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్విటర్‌ హోరెత్తిపోతోంది. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన దొబారా మూవీ ఆగస్టు 19న రిలీజ్‌ కాబోతోంది. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన కథానాయిక. అయితే అన్ని బాలీవుడ్‌ సినిమాల్లాగే తమ మూవీని కూడా బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియా ఊగిపోవాలని తాప్సీ, అనురాగ్‌ కోరుకోవడం గమనార్హం.

అసలు థియేటర్లలో రిలీజయ్యే అర్హత దొబారాకు లేనే లేదు, తాప్సీ ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్ని చేస్తుంది? మేము చూడటం ఆపేస్తే అప్పుడు తెలిసొస్తుంది,  మన దేశం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ సహించాల్సిన అవసరం లేదు, ఇలాంటి చీప్‌ మనుషులను మనం గౌరవించాల్సిన అవసరం లేదు అంటూ క్యాన్సల్‌ దొబారా అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.

చదవండి: ఘనంగా ప్రముఖ సీరియల్‌ నటి సీమంతం, ఫొటోలు వైరల్‌
 ఆ హీరోయిన్‌తో బ్రేకప్‌, మరొకరితో డేటింగ్‌? స్పందించిన హీరో

Advertisement
 
Advertisement
Advertisement