
పైన కనిపిస్తున్న హీరోయిన్ తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులోనే ఆమెకు ఎక్కువ అవకాశాలు వరించాయి. 14 సినిమాల్లో యాక్ట్ చేసింది.
సినిమా ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చినవాళ్లున్నారు. కలలు కని మరీ దాన్ని సాకారం చేసుకున్నవాళ్లున్నారు. అయితే ఎవరెలా వచ్చినా ఎక్కువకాలం కొనసాగాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, అలా అని అదృష్టం ఒక్కటే ఉంటే సరిపోదు. ఈ రెండూ జతగా ఉంటేనే నిలదొక్కుకోగలరు. ఆ రెండింటిలో ఏది బ్యాలెన్స్ కోల్పోయినా రంగుల ప్రపంచంలో కంటిన్యూ అవడం కష్టమే! హీరోయిన్స్‌కైతే ఈ రెండింటితోపాటూ అందాన్ని కాపాడుకుంటూ ఉండాలి.
తెలుగు సినిమాతో కెరీర్ ఆరంభం
పైన కనిపిస్తున్న హీరోయిన్ తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలుపెట్టింది. తన పేరు నిఖిత టుక్రాల్. 2002లో వచ్చిన హాయ్ మూవీలో కథానాయికగా మెరిసింది. వేణు, ప్రభుదేవాల 'కల్యాణ రాముడు', నితిన్ 'సంబరం', జగపతిబాబు 'ఖుషీఖుషీగా' చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. పునీత్ రాజ్‌కుమార్, ఫహద్ ఫాజిల్, దర్శన్ వంటి పెద్దపెద్ద హీరోల సరసన నటించింది. కన్నడ తర్వాత తెలుగులోనే ఆమెకు ఎక్కువ అవకాశాలు వరించాయి.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
అలా.. ఏవండోయ్ శ్రీవారు, ఆగంతకుడు, మహారాజశ్రీ నీ నవ్వే చాలు, అవును 2, టెర్రర్.. ఇలా మొత్తం 14 సినిమాల్లో యాక్ట్ చేసింది. 2017లో గంగదీప్ సింగ్ మగోను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలనుకుందో ఏమో కానీ రాజసింహ అని ఒకే ఒక కన్నడ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. తర్వాత మరే మూవీలోనూ కనిపించనేలేదు. దాదాపు ఆరేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. అయితే మధ్యలో.. కన్నడ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లోనూ పాల్గొని రెండో రన్నరప్‌గా నిలిచింది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. తరచూ తనతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది నిఖిత.
చదవండి: మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం!