Rashmika Mandanna: అయ్యో.. ఆ హీరో చేసిన పనికి ఆగిపోయిన రష్మిక సినిమా!

Buzz Is That Rashmika Mandanna And Tiger Shroff Movie Has Stopped - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. పుష్ప బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో రష్మిక క్రేజ్‌ కూడా అమాంతం పెరిగిపోయింది. సౌత్‌ సహా నార్త్‌లోనూ వరుస ఆఫర్లతో యమ బిజీగా అయిపోయింది ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న రష్మికకు గట్టి షాక్‌ తగిలింది. ఆమె నటిస్తున్న సినిమా ఆగిపోయినట్లు సమాచారం.

ఇంతకీ ఏమైందంటే.. టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి రష్మిక 'స్క్రూ ఢీలా' అనే చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం టైగర్‌కు రూ 35కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడు. ఈ మేరకు అగ్రిమెంట్‌ కూడా చేశాడు. అయితే షూటింగ్‌ మొదలయ్యాక టైగర్‌ను రెమ్యునరేషన్‌ తగ్గించుకోమని కరణ్‌ అతన్ని కోరాడట.

ప్రస్తుతం బాలీవుడ్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నందున పారితోషికం కింద రూ.20కోట్లు తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవాలని కరణ్‌ అడిగాడట. ఇందుకు ఇందుకు టైగర్‌ ససేమీరా అనడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు బీటౌన్‌ టాక్‌. దీంతో టైగర్‌ చేసిన పనికి రష్మికకు కూడా మంచి ఛాన్స్‌ మిస్సయినట్లైంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: 'ఆంటీ' అంటూ ట్రోలింగ్‌.. పోలీస్‌ కంప్లైట్‌ ఇచ్చిన అనసూయ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top