Buzz: Balagam Movie Director Comedian Venu To Direct Balakrishna Movie - Sakshi
Sakshi News home page

‘బలగం’వేణుకి బంపరాఫర్‌.. బాలయ్యతో సినిమా!

May 10 2023 9:22 AM | Updated on May 10 2023 9:58 AM

Buzz: Balagam Venu To Direct Balakrishna Movie - Sakshi

తొలి సినిమాతోనే హిట్‌ కొట్టిన దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో వేణు యెల్డండి ఒకరు. జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు.. దర్శకుడిగా మారి ‘బలగం’ అనే చిన్న చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడంతో పాటు.. పలు అంతర్జాతీయ అవార్డులను సాధించింది.

వేణు దర్శకత్వ ప్రతిభపై మెగాస్టార్‌ చిరంజీవితో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులంతా ప్రశంసల జల్లు కురిపించారు. వేణులో ఇంత టాలెంట్‌ ఉందా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పలు గ్రామాల్లో ప్రజలంతా కలిసి ఎల్‌ఈడీ తెరపై ఈ సినిమా వీక్షించారంటే.. బలగం ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. 

(చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! )

ఇప్పటి వరకు బలగం సక్సెస్‌ని ఎంజాయ్‌ చేసిన వేణు.. ఇప్పుడిక తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. తనకు డైరెక్టర్‌గా చాన్స్‌ ఇచ్చిన దిల్‌ రాజు బ్యానర్‌లోనే తన తర్వాతి సినిమా కూడా ఉంటుందని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు వేణు. దిల్‌ రాజు కూడా ఇదే మాట చెప్పారు. అయితే తర్వాతి సినిమా ఏ హీరోతో తీస్తారనేది ఇప్పటివరకు చెప్పలేదు. కానీ తాజాగా సోషల్‌ మీడియాలో వేణు తర్వాతి చిత్రంపై క్రేజీ రూమర్‌ చక్కర్లు కొడుతోంది.

(చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి )

వేణు తన రెండో సినిమాను ఓ స్టార్‌ హీరోతో ప్లాన్‌ చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు.. నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇప్పటికే బాలయ్యకు వేణు కథ చెప్పాడట. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే రూమర్‌ కనుక నిజమైతే.. బలగం వేణుకి బంపరాఫర్‌ దక్కినట్లే అని నెటిజన్స్‌ అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది వేణు స్పందిస్తేనే తెలుస్తుంది.

ఇక బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష దర్శకుడు కార్తిక్‌ దండు కూడా బాలయ్యకు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్యకు హ్యాట్రిక్‌ విజయాలు అందించిన బోయపాటి కూడా త్వరలోనే మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement