ఆర్యన్‌ బెయిల్‌పై వీడని సస్పెన్స్‌.. విచారణ గురువారానికి వాయిదా | Sakshi
Sakshi News home page

Aryan khan Drug's Case: ఆర్యన్‌ బెయిల్‌పై వీడని సస్పెన్స్‌.. విచారణ గురువారానికి వాయిదా

Published Wed, Oct 27 2021 7:38 PM

Bombay HC Adjourns Aryan Khan Bail Hearing Till Tomorrow - Sakshi

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. అతని తరుఫు న్యాయవాదులు వాదించిన తర్వాత ఎన్సీబీ తరపున లాయర్‌ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే వారి వాదనను రేపు వింటామని స్పష్టం చేసిన న్యాయమూర్తి విచారణను గురవారానికి వాయిదా వేశారు.

దీంతో బాద్‌షా కుటుంబంతో పాటు అభిమానులు సైతం ఏ జరుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ కోర్టులో, ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టులో బెయిల్ రిజెక్ట్‌ కాగా.. ఈ సారి హైకోర్టులో బెయిల్ వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఆర్యన్‌ సెల​బ్రిటీ కావడంతోనే ఈ కేసులో ఇరికించారు తప్ప అతని వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లేవు. అధికారులు బెయిల్‌ను అడ్డుకునేందుకు ఆధారాలుగా చూపుతున్న వాట్సాప్‌ చాటింగ్స్‌ ఆరు నెలల క్రితానివి. అతను, అతని స్నేహితుడి వద్ద చాలా తక్కువ మెతాదులో డ్రగ్స్‌లో దొరికినందు వల్ల బెయిల్‌ ఇవ్వాలని’ తెలిపారు. అయితే గురువారమైన ఆర్యన్‌ బెయిలు విషయ ఓ కొలిక్కి వస్తుందో లేదో చూద్దాం.

చదవండి: బాలీవుడ్‌ నటుల ఫోన్స్‌ని వాంఖడే ట్యాప్‌ చేశారు

Advertisement
 
Advertisement
 
Advertisement