
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె 'పఠాన్', 'గెహ్రియాన్' సినిమాలకుగానూ రూ.15 కోట్లు, 'డార్లింగ్స్' కోసం ఆలియా భట్ రూ.15 కోట్ల వసూలు చేశారట! 'గంగూబాయ్ కతియావాడి'తో పాటు 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్‌కహానీ'లో భాగమవడానికి ఆలియా తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎంత తీసుకుంటున్నామనేదే ముఖ్యం అంటున్నారు స్టార్స్. కొద్దోగొప్పో, తక్కువో ఎక్కువో.. ఎన్ని సినిమాలు చేసినా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ పోటీపడి మరీ వసూలు చేస్తున్నారు. సినిమా హిట్‌ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తమ పారితోషికాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. లక్షలు తీసుకోవడం మానేసి కోట్లే కావాలంటున్నారు. ఇంతకీ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లు ఎంతెంత తీసుకుంటున్నారు? ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంది? అన్న విషయాలను చూద్దాం..
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఒక్క సినిమాకు రూ.21-25 కోట్ల దాకా వసూలు చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. కానీ ఆమె పారితోషికం 9 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె 'పఠాన్', 'గెహ్రియాన్' సినిమాలకుగానూ రూ.15 కోట్లు, 'డార్లింగ్స్' కోసం ఆలియా భట్ రూ.15 కోట్ల వసూలు చేశారట! 'గంగూబాయ్ కతియావాడి'తో పాటు 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్‌కహానీ'లో భాగమవడానికి ఆలియా తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 'జీ లె జరా' సినిమా కోసం కత్రినా కైఫ్ రూ.12 కోట్లు, ప్రియాంక చోప్రా రూ.10 కోట్లు తీసుకుంది. కానీ 'స్కై ఈజ్ పింక్' మూవీకి మాత్రం ప్రియాంక రూ.8 కోట్లకే సంతకం చేసిందట.
ఇక శ్రద్ధా కపూర్ రూ.7 కోట్ల వసూలు చేస్తుండగా తాప్సీ 'లూప్ లపేటా' కోసం రూ.5 కోట్లు తీసుకుంది. విద్యాబాలన్ చాలా రోజుల నుంచి రెమ్యునరేషన్‌ను పెంచకుండా నిలకడగా రూ.4 కోట్లు వసూలు చేస్తుండగా కృతి సనన్ కూడా తన ప్రతి సినిమాకు అంతే మొత్తం తీసుకుంటోంది. 'జగ్ జగ్ జియో'కు కియారా అద్వానీ రూ.2.50 కోట్లు తీసుకున్నట్లు టాక్! జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ప్రతి సినిమాకు రెండు నుంచి రెండున్నర కోట్లు తీసుకుంటుంటే అనన్య పాండే రూ.1.50 కోట్లు వసూలు చేస్తోంది.