బాహుబలిలోని ‘మనోహరి’ పాటకు స్టెప్పులేసిన ఈ భామ ఇప్పుడేం చేస్తోంది?

Bollywood Model Madhu Sneha Upadhyay Biography In Telugu - Sakshi

ఓవర్‌నైట్‌ స్టార్‌గా మెరిసి.. వెంటనే కనుమరుగైన తారలు ఎంతోమంది. అలాంటి వారిలో ఒకరే.. మధుస్నేహ ఉపాధ్యాయ. బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో వెండితెర మీద ఒక్కసారిగా మెరిసి  ప్రస్తుతం వెబ్‌తెర మీద వెలిగిపోతోంది.

మధుస్నేహ.. పుట్టింది కోల్‌కతాలో.. పెరిగింది ముంబైలో.  

చిన్నప్పుడే సినిమాల్లో నటించాలని, తల్లిదండ్రులకు తెలియకుండా ఆడిషన్స్‌కు వెళ్లి తన్నులు తినింది. 

చదువు పూర్తిచేయాలని గట్టిగా చెప్పడంతో మంచి మార్కులతోనే డిగ్రీ పట్టా సాధించింది. 
 
 నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో ఒకవైపు మోడలింగ్‌ చేస్తూ ఆడిషన్స్‌ అటెండ్‌ అయ్యేది. 

మొదటి అవకాశంతోనే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమాలోని ‘మనోహరి’ పాటలో ప్రభాస్‌తో పాటు  డాన్స్‌ చేసింది. ఆ పాట.. ఆ డాన్స్‌ ఆమెను అందరి దృష్టిలో పడేలా చేశాయి కానీ కొత్త అవకాశాలను ఇవ్వలేకపోయాయి. దీంతో సినిమాలను వదిలి సిరీస్‌లలో నటించడం మొదలుపెట్టింది. 

2018లో ‘ది ఎట్సెట్రాస్‌’ అనే కామెడీ వెబ్‌ సిరీస్‌లో నటించి, పాపులర్‌ అయింది. తర్వాత పలు యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ బిజీగా మారింది. 

ప్రస్తుతం ‘బేకాబూ’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.  

మా అమ్మ వయసులో ఉన్నప్పటి ఫొటోలను చూసి అమ్మ హీరోయిన్‌ అయితే బాగుండు అనుకున్నా. చిత్రంగా నాకు నటనపై ఇష్టం పెరిగింది. నటిగా మారాలనే లక్ష్యం కుదిరింది.  – మధుస్నేహ ఉపాధ్యాయ. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top