Bhabubali Movie
-
‘మనోహరి’ పాటకు స్టెప్పులేసిన ఈ భామ ఇప్పుడేం చేస్తోంది?
ఓవర్‌నైట్ స్టార్‌గా మెరిసి.. వెంటనే కనుమరుగైన తారలు ఎంతోమంది. అలాంటి వారిలో ఒకరే.. మధుస్నేహ ఉపాధ్యాయ. బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో వెండితెర మీద ఒక్కసారిగా మెరిసి ప్రస్తుతం వెబ్‌తెర మీద వెలిగిపోతోంది. ►మధుస్నేహ.. పుట్టింది కోల్‌కతాలో.. పెరిగింది ముంబైలో. ►చిన్నప్పుడే సినిమాల్లో నటించాలని, తల్లిదండ్రులకు తెలియకుండా ఆడిషన్స్‌కు వెళ్లి తన్నులు తినింది. ►చదువు పూర్తిచేయాలని గట్టిగా చెప్పడంతో మంచి మార్కులతోనే డిగ్రీ పట్టా సాధించింది. ►నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో ఒకవైపు మోడలింగ్ చేస్తూ ఆడిషన్స్ అటెండ్ అయ్యేది. ►మొదటి అవకాశంతోనే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలోని ‘మనోహరి’ పాటలో ప్రభాస్‌తో పాటు డాన్స్ చేసింది. ఆ పాట.. ఆ డాన్స్ ఆమెను అందరి దృష్టిలో పడేలా చేశాయి కానీ కొత్త అవకాశాలను ఇవ్వలేకపోయాయి. దీంతో సినిమాలను వదిలి సిరీస్‌లలో నటించడం మొదలుపెట్టింది. ►2018లో ‘ది ఎట్సెట్రాస్’ అనే కామెడీ వెబ్ సిరీస్‌లో నటించి, పాపులర్ అయింది. తర్వాత పలు యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా మారింది. ►ప్రస్తుతం ‘బేకాబూ’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. మా అమ్మ వయసులో ఉన్నప్పటి ఫొటోలను చూసి అమ్మ హీరోయిన్ అయితే బాగుండు అనుకున్నా. చిత్రంగా నాకు నటనపై ఇష్టం పెరిగింది. నటిగా మారాలనే లక్ష్యం కుదిరింది. – మధుస్నేహ ఉపాధ్యాయ. -
'రాజమౌళి అక్కడ పుట్టకపోవడం దురదృష్టం'
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆకాశానికెత్తేశారు. ఇక ఏ సినిమా అయిన దీని తర్వాతే అని వ్యాఖ్యానించారు. హీరో కంటే కథే గొప్ప అని ఈ చిత్రం రుజువు చేసిందని, ఈ విషయాన్ని హాలీవుడ్ దశాబ్దాల క్రితమే గుర్తించిందని పేర్కొన్నారు. తామే గొప్పవాళ్లమని విర్రవీగుతున్న హీరోలకు 'బాహుబలి' మేలుకొలుపు అన్నారు. సింహాలు, పులులు, ఏనుగులు, కొండచిలువలతో నిండివున్న ఇండస్ట్రీ జంగిల్ లోకి బాహుబలి డైనోసార్ వచ్చిందని... అంతకుముందున్న పాలన మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రభాస్ టెరిఫిక్ గా చేశాడని ప్రశంసించారు. దగ్గుబాటి రానా అయితే ఫిజికల్ గా, పెఫ్మార్ మెన్స్ పరంగా శిఖర స్థాయిని అందుకున్నాడని ఆకాశానికెత్తారు. రమ్యకృష్ణ చాలా బాగా చేసిందని మెచ్చుకున్నారు. 'బాహుబలి' తర్వాత వచ్చే పెద్ద హీరోల సినిమా 5డీలో చూడాల్సివుంటుందన్నారు. రాజమౌళి ఇక్కడకు పుట్టినందుకు తెలుగువారు గర్వపడక్కర్లేదని.. బాంబే లేదా లాస్ ఏంజెలెస్ లో పుట్టకపోవడం అతడి దురదృష్టమని ట్విటర్ లో పేర్కొన్నారు. It's not pride of telugus that Rajmouli is born here ..it's his misfortune he wasn't born in Bombay or Los Angeles — Ram Gopal Varma (@RGVzoomin) July 11, 2015