Bigg Boss 5 Telugu: హమీదాకు ముద్దులు, హగ్గులు! తట్టుకోలేకపోయిన ప్రియాంక

Bigg Boss Telugu 5: Priyanka Disappointed When Sreeram Dance With Hamida - Sakshi

Bigg Boss Telugu 5, Episode 27: హౌస్‌మేట్స్‌ రూల్స్‌ సరిగా పాటించనందుకు జెస్సీ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ కెప్టెన్‌గా అది నీ వైఫల్యమే అంటూ హౌస్‌మేట్స్‌ అతడిని చెత్త ఆటగాడిగా నిర్ణయించారు. మరోపక్క సింగర్‌ శ్రీరామ్‌ దొరికిందే ఛాన్స్‌ అన్నట్లుగా హమీదా కోసం లవ్‌ సాంగ్‌ పాడుతూ, ఆమెతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఇక సన్నీ కూడా తన యాంకరింగ్‌తో దుమ్ము దులిపేశాడు. మరి నేటి (అక్టోబర్‌ 1) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

అర్ధరాత్రి సైగలు, గాల్లో ముద్దులు
కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ అని, అలాంటి కెప్టెన్సీ తనకు దక్కకుండా చేసిందని కాజల్‌ మీద మండిపడింది శ్వేత. నువ్వు నీ మైండ్‌ను ఎక్కువగా వాడుతున్నావు, కానీ మనసును కాదని కాజల్‌ను విమర్శించింది. దీనిపై కాజల్‌ స్పందిస్తూ.. శ్రీరామచంద్ర గెలవాలనుకున్నా, అంతే తప్ప నీ ఫీలింగ్స్‌ నాకు మ్యాటరే కాదని శ్వేత ముఖం మీదే చెప్పింది. ఇదిలా వుంటే రాత్రి అందరూ పడుకున్నాక శ్రీరామ్‌, హమీదా సైగలు చేసుకుంటూ గాల్లో ముద్దులు పంపుకుని గుడ్‌నైట్‌ చెప్పుకున్నారు.

వయ్యారాలు ఒలకబోసిన ప్రియాంక సింగ్‌
తర్వాతి రోజు నటరాజ్‌ మాస్టర్‌ మరోసారి రవి మీద పడ్డాడు. రవి టాస్క్‌ చేస్తున్నంతసేపు నత్తలా అనిపించాడని కామెంట్‌ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. మాస్టర్‌ చాలా ఇరిటేట్‌ చేస్తున్నాడని చిరాకు పడ్డాడు. అసలు తన పేరు కూడా ఎత్తొద్దని ఆయనకు చెప్పంటూ లోబోకు సూచించాడు. ఇక నల్లచీర కట్టుకుని ప్రియాంక సింగ్‌ వయ్యారాలు పోతుంటే శ్రీరామ్‌ పాటతో ఆమె వెనకాల పడ్డాడు.

మానస్‌ బెస్ట్‌, జెస్సీ వరస్ట్‌..
అనంతరం బిగ్‌బాస్‌.. బెస్ట్‌, వరస్ట్‌ పర్ఫామర్లను ఎన్నుకోమని ఆదేశించాడు. దీంతో శ్రీరామ్‌-హమీదా జంట.. లోబోను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొంది. యానీ మాస్టర్‌-శ్వేత.. శ్రీరామ్‌ను బెస్ట్‌, కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. విశ్వ-రవి జోడీ.. మానస్‌ను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొంది. షణ్ముఖ్‌-సిరి.. మానస్‌ బెస్ట్‌, లోబో వరస్ట్‌ అని తేల్చారు. తర్వాత వచ్చిన నటరాజ్‌ మాస్టర్‌- లోబో... మానస్‌ను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా తెలిపారు. కాజల్‌-జెస్సీ.. మానస్‌ను బెస్ట్‌, లోబోను వరస్ట్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియ- పింకీ.. మానస్‌ను బెస్ట్‌, లోబో వరస్ట్‌ అని తెలిపారు. సన్నీ- మానస్‌.. లోబోను బెస్ట్‌ అని పేర్కొంటూ వేరేవాళ్ల నుంచి ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నావని జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా తేల్చారు. మొత్తంగా ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌గా మానస్‌ను, వరస్ట్‌ పర్ఫామర్‌గా జెస్సీని ప్రకటించారు. దీంతో జెస్సీ రెండోసారి జైల్లోకి వెళ్లాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో స్పెషల్‌ షో జరిగింది. ఈ షోకి సన్నీ వీజేగా వ్యవహరిస్తూ కెప్టెన్‌ శ్రీరామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో కాజల్‌ మైక్‌ అందుకుంటూ సిరి, హమీదాలలో ఎవరిని ఎంచుకుంటారని సింగర్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికతడు లంచ్‌ టైమ్‌లో సిరి, డిన్నర్‌ టైమ్‌లో హమీదా అని తెలివిగా ఆన్సరిచ్చాడు. మరి టిఫిన్‌ టైమ్‌లో ఎవరూ లేరా? అని సన్నీ కౌంటరిచ్చాడు. మంచి అమ్మాయి కోసం వెయిటింగ్‌ అన్నావు, ఇక్కడున్నవారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావు? అని సన్నీ క్వశ్చన్‌ వేయగా శ్రీరామ్‌.. సిరి కమిటెడ్‌ కాకపోయుంటే తప్పకుండా ఆమెకే ట్రై చేసేవాడిని అని చెప్పాడు. దీంతో రవి.. అన్న, నీ టేస్ట్‌ ఇంత బ్యాడ్‌ అనుకోలేదని కౌంటరిచ్చాడు.

గుండెల్లో ఏ అమ్మాయైనా ఉందా? అన్న ప్రశ్నకు.. గుండెలనిండా ఏ అమ్మాయినైనా నింపుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటూ ఓ ప్రియా.. ప్రియా.. పాటందుకుని ఊహల్లో తేలిపోయాడు. ఇక్కడున్నవారిలో ఎవరిని డేట్‌కు తీసుకెళ్తారన్న ప్రశ్నకు సింగర్‌.. హమీదా పేరు చెప్తూ పాటందుకున్నాడు. అంతేకాకుండా ఆమెను ఎత్తుకుని, హత్తుకుని డ్యాన్స్‌ చేశాడు. అయితే శ్రీరామ్‌ హమీదాకు క్లోజ్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది పింకీ. ఆమెను ఎత్తుకుని తిరగడం అవసరమా అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. తర్వాత లోబో, సన్నీ కలిసి హౌస్‌మేట్స్‌ను రోస్ట్‌ చేసి పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top