'బిగ్‌బాస్' 2.0.. హౌసులోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu 2.0: 'బిగ్‌బాస్ 7' కొత్త కంటెస్టెంట్స్.. వీళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

Published Sun, Oct 8 2023 7:16 PM

Bigg Boss 7 Telugu launch 2 Live Updates - Sakshi

బిగ్ బాస్ 7 ఐదు వారాలు పూర్తిచేసుకుంది. ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేయగా, మరో కంటెస్టెంట్‌ని సీక్రెట్ రూంలోకి పంపించేశారు. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 35 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

ప్రతి ఆదివారం ఒక్కొక్కరిని సేఫ్ చేయడంతో మొదలయ్యేది. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌తో మొదలుపెట్టారు. అలా ఐదోవారం శుభశ్రీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఆ వెంటనే గౌతమ్‌ని కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. కానీ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. అతడిని సీక్రెట్ రూంలోకి పంపించారు. అక్కడ ఏం చేయాలి? ఎలా ఉండాలనేది బిగ్‌బాస్ చెబుతాడని నాగార్జున అన్నాడు.

తొలి కంటెస్టెంట్‌గా అర్జున్
పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చకున్న అంబటి అర్జున్.. బిగ్ బాస్ లాంచ్ 2.0లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే దమ్ము ఎవరు? దుమ్ము ఎవరు? అనేది చెప్పమన్నారు. దీంతో అర్జున్.. యవర్, ప్రశాంత్ ని దమ్ము కేటగిరీలో పెట్టాడు. సందీప్, అమరదీప్ దుమ్ము కేటగిరీలో పెట్టాడు.

ఎవరీ అర్జున్?
చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్‌ నిజంగానే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేశాడు. మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. కానీ తనకు జనాల్లో పేరు తీసుకువచ్చింది మాత్రం సీరియల్సే! ప్రస్తుతం అతడి చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేనట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ మంచి కంబ్యాక్‌ ఇవ్వడానికి బిగ్‌బాస్‌ షోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వచ్చీరావడంతోనే యావర్‌, ప్రశాంత్‌ దమ్మున్న గేమ్‌ ఆడుతున్నారని, అమర్‌దీప్‌, సందీప్‌ దుమ్ము దుమ్ముగా ఆడుతున్నారని చెప్పాడు. మరి ఇతడు దుమ్ము రేపేలా ఆడతాడా? ఎలా ఆడతాడనేది చూడాలి!

రెండో కంటెస్టెంట్‌గా అశ్విని
రెండో కంటెస్టెంట్‌గా అశ్విని శ్రీ అనే అమ్మాయి బిగ్‌బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. దమ్ము కేటగిరిలో ప్రశాంత్, శివాజీ.. దుమ్ము కేటగిరీలో ప్రియాంక, శోభాశెట్టి అని చెప్పింది. తానొక కిక్ బాక్సర్ అని చెప్పుకొచ్చింది.

ఎవరీ అశ్విని?
సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసేవారిలో ముందు వరుసలో ఉంటుంది అశ్విని శ్రీ. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి ఆర్టిస్ట్‌గా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు బిగ్‌బాస్‌ షోను వేదికగా ఏర్పాటు చేసుకుంది.

మూడో కంటెస్టెంట్‌గా భోలె షావళి
బిగ్‌బాస్ హౌసులోకి మూడో కంటెస్టెంట్‌గా సింగర్ కమ్ సంగీత దర్శకుడు భోలె షావళి ఎంట్రీ ఇచ్చాడు. అలానే పాటబిడ్డ అనే తనని తాను చెప్పుకొంటూ.. హౌస్ట్ నాగార్జునపై ఓ పాట క్రియేట్ చేసి పాడాడు. దమ్ము కేటగిరీలో శివాజీ, ప్రశాంత్.. దుమ్ము కేటగిరీలో అమరదీప్ అని చెప్పాడు. 

ఎవరీ భోలె షావళి?
'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్‌లో పడ్డ.. అది కాదంటే కాళ్ల మీద పడ్డ..' పాటతో భోలె షావళి పేరు మార్మోగిపోయింది. ఈ పాటతో సెన్సేషన్‌ సృష్టించిన భోలె షావళి సింగర్‌ మాత్రమే కాదు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా! వెండితెరకు సైతం ఎన్నో హిట్‌ సాంగ్స్‌ అందించాడు. మహబూబాబాద్‌ జిల్లాలో పుట్టిపెరిగిన ఇతడు ప్రారంభంలో చక్రి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆయన దగ్గర మెళకువలు నేర్చుకున్న తర్వాత సింగర్‌గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నించాడు, సక్సెస్‌ అయ్యాడు. బతుకమ్మ, బోనాల పండగల సమయంలోనూ ప్రత్యేక గీతాలు కంపోజ్‌ చేస్తూ ఉంటాడు. ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తన టాలెంట్‌తో మాయ చేసేందుకు బిగ్‌బాస్‌ షోకి వచ్చాడు. మరి తన మ్యాజిక్‌ పని చేస్తుందా? ఎన్ని వారాలు కొనసాగుతాడు? అనేది చూడాలి.

నాలుగో కంటెస్టెంట్‌గా పూజామూర్తి
బిగ్‌బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్‌గా సీరియల్ నటి పూజామూర్తి ఎంట్రీ ఇచ్చింది. అలానే సరిగ్గా ఈ షోకి రావడానికి ముందు చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇందులో పాల్గొని ఆయన చివరి కలని నిజం చేస్తానని చెప్పింది. దమ్మున్న వారిలో శివాజీ, సందీప్ ఉంటారని.. దుమ్ము కేటగిరీలో తేజ ఉంటారని చెప్పింది.

ఎవరీ పూజామూర్తి?
గుండమ్మ కథ సీరియల్‌తో జనాలకు దగ్గరైంది పూజా మూర్తి. ఈమె కన్నడ అమ్మాయి. కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ 7 ప్రారంభమైన రోజే హౌస్‌లో అడుగుపెట్టాల్సింది. కానీ సరిగ్గా షో ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు ఆమె ఇంట విషాదం నెలకొంది. తండ్రి కన్నుమూయడంతో ఆమె రియాలిటీ షోలో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. తాజాగా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టింది. ఎంట్రీ బాగుంది, మరి ఆట ఎలా ఉంటుందో చూడాలి!

ఐదో కంటెస్టెంట్‌గా నయని పావని
బిగ్‌బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని (సాయి పావని) ఎంట్రీ ఇచ్చింది. దమ్మున్న వాళ్లలో యవర్, ప్రశాంత్ అని దుమ్ముదుమ్ముగా ఆడుతుందని అమరదీప్, తేజ అని చెప్పింది.

ఎవరీ నయని పావని?
టిక్‌టాక్‌ వీడియోలతో బాగా ఫేమస్‌ అయింది నయని పావని. ఈమె అసలు పేరు సాయి పవని రాజ్‌. పక్కా తెలంగాణ అమ్మాయి. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ బుట్టలో వేసుకుంది. సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్‌ సుబ్బులు కేరాఫ్‌ అనకాపల్లి వంటి పలు షార్ట్‌ ఫిలింస్‌లోనూ నటించింది. ఈ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు. ఆ మధ్య డ్యాన్స్‌ షో ఢీలోకి వెళ్లి మంచి గుర్తింపు పొందింది. షార్ట్‌ ఫిలింస్‌, రియాలిటీ షోలే కాదు సినిమాలు కూడా చేసింది. చిత్తం మహారాణి, సూర్యకాంతం అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందానికి అందం, దానికి మించి టాలెంట్‌ ఉన్న ఈ బ్యూటీ తాజాగా బిగ్‌బాస్‌ 7లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది. మరి తన జర్నీ ఎలా ఉంటుంది? అందరినీ ఆటాడిస్తుందా? తన ఆట తనే ఆడుతుందా? చూడాలి!

ఇక వీళ్ల ఐదుగురి ఎంట్రీతో పాటు ఈ ఎపిసోడ్‌లో తన 'చిన్నా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధార్థ్.. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ, నుపురు సనన్, గాయత్రి భరద్వాజ్ కాసేపు అలా వచ్చి సందడి చేసి వెళ్లిపోయారు. అలానే ఇప్పటివరకు అందరూ పవరస్త్ర కోసం పోటీపడ్డారు. కానీ కొత్తగా వచ్చిన ఐదుగురితో పాటు ఆల్రెడీ బిగ్‌బాస్‌లో ఉన్న ఎనిమిది మంది హౌస్‌మేట్స్ అయిపోయారని నాగార్జున చెప్పాడు. అలా వాళ్లలో అర్జున్, అశ్వినికి హౌస్ ఆఫ్ లగేజీ టాస్క్ ఇచ్చారు. మిగతావాళ్లలో ఎవరెవరి దగ్గర ఏ లగేజీ ఉండాలనేది వీళ్లు డిసైడ్ చేస్తారు. అలానే భోలె షావళి, పూజామూర్తి, నయనపావనికి నాగార్జున హౌస్ ఆఫ్ బెడ్స్ టాస్క్  ఇచ్చారు. దీన్నిబట్టి ఎవరు ఏ బెడ్‌పై పడుకోవాలనేది వీళ్లు నిర్ణయిస్తారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్స్ ఉంటాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement