Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి! | Bigg Boss Telugu 7 Day 93 Latest Promo Pallavi Prashanth, Amardeep - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Promo: అమర్‌తో గొడవ.. తీరు మార్చుకోని రైతుబిడ్డ ప్రశాంత్

Published Tue, Dec 5 2023 5:16 PM | Last Updated on Tue, Dec 5 2023 5:34 PM

Bigg Boss 7 Day 93 Latest Promo Pallavi Prashanth Amardeep - Sakshi

బిగ్‌బాస్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అలా లేకపోతే 14వ వారం వరకు ఎలా వస్తాడు. అంతే కదా. అయితే అంతా బాగానే ఉన్నా గానీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తాజా నామినేషన్స్‌లోనూ తనకు అలవాటైన ఓ థియరీ ఉపయోగిద్దామని చూశాడు. కానీ ఎదురుదెబ్బ తగిలింది. గిలగిల కొట్టేసుకున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోతో ఆ విషయం అర్థమైంది.

(ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

రైతుబిడ్డ అతితెలివి
కామన్‌మ్యాన్ ప్లస్ రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన మిగతా రోజుల్లో ఏ మాత్రం సౌండ్ చేయకుండా, అసలు ఉన్నాడా లేడా అన్నట్లు ఉంటాడు. నామినేషన్స్ వస్తే మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టేసి, మెడలో టవల్ వేసుకుని మరీ బుద్దిమంతుడు అయిపోయాడు. అవతల వాళ్లు చెబుతున్నది వినకుండా, వాళ్ల చెప్పిన పాయింట్ మార్చేసి మరీ తనపై సింపతీ వచ్చేలా ప్లేట్ తిప్పేస్తాడు. గతంలో ఓసారి సందీప్ మాస్టర్ నామినేషన్ చేసిన టైంలో.. తనని ఊరోడు అన్నాడని నానా హంగామా చేశాడు. 

అమర్ రివర్స్ పంచ్
అయితే గతకొన్ని వారాల నుంచి నామినేషన్స్ సైలెంట్‌గా పూర్తి చేస్తూ వచ్చిన తాజాగా సోమవారం మాత్రం అమర్‌తో పెద్ద వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే 'ఆడవాళ్లలా మాట్లాడకు' అని అర్థమొచ్చేలా అన్నాడు. దీంతో అమర్.. దాన్ని రచ్చ చేశాడు. 'నన్ను ఆడోడా అంటావా, చేతులకు గాజులు వేసుకోవాలా?' అని అమర్ రెచ్చిపోయాడు. దీంతో రైతుబిడ్డ డిఫెన్స్‌లో పడిపోయాడు. ప్రతిసారీ ఏదో ఒకలా సింపతీ కొట్టేద్దామని చూసే రైతుబిడ్డకు ఈసారి అమర్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈ గొడవని ఎవరో ఒకరు ఫుల్‌స్టాప్ పెట్టాలి. కానీ అమర్ రెచ్చిపోయి ప్రశాంత్ తప్పు చేసేలా చేస్తున్నాడు. మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఈ పంచాయతీ సాగింది. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎలా? ఎండ్ కార్డ్ పడిందనేది రాబోయే ఎపిసోడ్‌లో తేలుతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement