బిగ్‌బాస్‌: అందరి కన్ను సోహైల్‌ పైనే

Bigg Boss 4 Telugu: Who Will Has Heighist Coins In Task Till End - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4లో కాయిన్ల టాస్క్‌ మరింత ముదురుతోంది. నిన్నటి వరకు తాము కూడగట్టుకున్న కాయిన్లను పదిలంగా దాచుకోడానికి ప్రయత్నించిన ఇంటి సభ్యులు ఇకపై ఇతరులు సంపాదించిన కాయిన్లను దొంగింలించేందుకు కాచుకు కూర్చున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‌బాస్‌ కూడా మిగతా వారి నుంచి కాయిన్లు రాబట్టుకునేందుకు ఒకే చెప్పడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. సామ, దాన, భేద, దండోపాయాలతో తమ వద్ద ఉన్న కాయిన్ల విలువలను పెంచుకునేందుకు నడుం బిగించారు. చివరి బజర్‌ మోగే వరకు ఎవరి వద్ద ఎక్కవ కాయిన్లు ఉంటే వారే ఈ టాస్క్‌ విజేతలుగా మారనున్నారు. దీంతో ఇప్పుడు కదా గేమ్‌లో అసలైన మజా రాబోతుందని జనాలు అభిప్రాయపడుతున్నారు, (బిగ్‌బాస్‌: కాసుల వేటలో గెలుపెవరిది!)

ఇక ఎవరి నుంచి కాయిన్లు దొంగిలించాలో ఓ ప్లాన్‌ వేసుకున్న కంటెస్టెంట్లు పథకం ప్రకారం లాక్కోనున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సంఖ్యలో కాయిన్స్‌ సాధించిన సోహైల్, మెహబూబ్‌నే మిగతా వారందరూ టార్గెట్‌ చేసేలా కన్పిస్తున్నారు. అలాగే ఈ గేమ్‌లో అవినాష్‌ను పాయింట్స్‌ పట్టుకోమని తనకు సాయం చేస్తానని అరియానా పేర్కొంది. మాస్టర్‌ పాయింట్లు మాస్టర్‌కు ఇచ్చేద్ధాం అని సోహైల్‌ చెప్పగా ఇందుకు అఖిల్‌ వద్దు అని తెగేసి చెప్పేశాడు. కానీ మాస్టర్‌ మాత్రం తన వద్ద లాక్కున్న కాయిన్లకు తనకు ఇచ్చేమని కోరాడు. మరి ఇన్ని ఆలోచనలు చేస్తన్న ఇంటి సభ్యుల్లో చివరికి ఎవరి వద్ద అత్యధికంగా కాయిన్లు ఉంటాయో చెప్పడం ఊహించలేం. అది తెలుసుకోవాలంటే ఆ రోజు రాత్రి బిగ్‌బాస్‌ వచ్చేంత వరకు ఆగాల్సిందే. (క‌థ వేరే ఉంట‌ది: మాస్ట‌ర్‌కు సోహైల్ వార్నింగ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top