ఎవ‌డి ఆట వాళ్లు ఆడండి: నాగ్ మండిపాటు

Bigg Boss 4 Telugu: Nagarjuna Akkineni Serious On Housemates - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో ఈ వారం ఇంటి స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌లో చాలా తేడా క‌నిపించింది. అవినాష్‌ కామెడీని సుజాత పాజిటివ్‌గా తీసుకోలేక‌పోయింది. అభిజిత్‌, హారిక మ‌ధ్య దూరం పెరిగిన‌ట్టే పెరిగి అమాంతం ద‌గ్గ‌రైపోయారు. దివి కూడా అంద‌రితో క‌లివిడిగా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. గ‌త సారి టాస్క్‌లో విజృంభించిన గంగ‌వ్వ ఈ వారం మాత్రం క‌నీసం ఆట‌లో పాల్గొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌ ఎప్పుడూ న‌వ్వుతూ న‌వ్విస్తూ ఉండే అమ్మ రాజ‌శేఖ‌ర్ అన‌వ‌స‌రంగా ఆగ్ర‌హానికి లోన‌య్యాడు.

మాస్ట‌ర్ చేస్తే ఒప్పు, సోహైల్ చేస్తే త‌ప్పు!
ఇత‌రుల కాయిన్ల‌ను అమ్మ రాజ‌శేఖ‌ర్‌ దొంగ‌త‌నం చేశాడు. సోహైల్ కూడా అదే ప‌ని చేశాడు. రాత్రంతా నిద్ర పోకుండా మాస్ట‌ర్ కాయిన్ల‌తో పాటు మిగ‌తావారివి కూడా కొట్టేశాడు. కానీ మాస్ట‌ర్‌కు మాత్రం ఇది మింగుడు ప‌డ‌లేదు. సోహైల్ క్ష‌మించ‌రాని నేరం చేశాడ‌న్న‌ట్టుగా ఆవేశంతో ఊగిపోతూ అత‌డిని ఏకిపారేశాడు. సోహైల్ కూడా ఎదురు తిరిగాడు. కానీ అత‌డి వ‌య‌సుకు గౌర‌వమిచ్చి కాళ్లు ప‌ట్టుకుని సారీ చెప్పాడు. క‌ట్ చేస్తే ఈ ఇద్ద‌రూ కెప్టెన్ కాలేక‌పోయారు. ఏ మాత్రం అంచ‌నాలు లేని కుమార్ సాయి కెప్టెన్సీని ఎగ‌రేసుకుపోయాడు. దీంతో షాక్ అవ్వ‌డం ఇంటి స‌భ్యుల వంతైంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మాస్టర్‌ కాళ్లు పట్టుకున్న సోహైల్‌)

మ‌రోసారి హెచ్చ‌రించిన నాగ్‌
అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో ఎవ‌రు మంచి దొంగ‌? ఎవ‌రు భ‌లే దొంగ అనేది తేల్చి చెప్పేందుకు నాగార్జున సిద్ధ‌మ‌వుతున్నారు. అంతే కాకుండా వ్య‌క్తిగ‌తంగా ఆటాడ‌కుండా ప‌క్క‌వారికే ఎక్కువ స‌పోర్ట్ చేసినందుకు కూడా నాగ్ ఆగ్ర‌హానికి లోన‌య్యారు. ఎవ‌డి ఆట వాళ్లు ఆడండి.. లేదంటే క‌థ వేరే ఉంట‌ది అని ఫైర్ అయ్యారు. ఈ మాట మొద‌టి వారం నుంచి చెప్పుకుంటూ వ‌స్తున్నా ఇంటిస‌భ్యుల్లో మాత్రం మీస‌మెత్తు మార్పు లేదు. క‌నీసం ఈసారైనా ఆయ‌న మాట వింటారో! పెడ చెవిన పెడితారో! ఇంకా నాగ్ ఎవ‌రెవ‌రికి అక్షింత‌లు వేయ‌నున్నార‌నేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: స్వాతి దీక్షిత్ త‌ప్పు చేస్తోందా?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top