Devi Nagavalli Wiki, Bio, Photos | Bigg Boss 4 Telugu Contestant - Sakshi
Sakshi News home page

డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్ దేవి నాగ‌వ‌ల్లి

Sep 6 2020 10:10 PM | Updated on Sep 27 2020 11:27 PM

Bigg Boss 4 Telugu: Devi Nagavalli As 7th Contestant - Sakshi

ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్ట్ దేవి నాగవల్లి‌. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట.  ఆమె న్యూస్‌ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజంపై మక్కువతో మాస్ కమ్యునికేషన్‌లో డిప్లొమో చేసి టీవీ 9తో కెరియర్ మొదలుపెట్టారు. ప్రజెంటేషన్‌లో తన మార్క్ చూపిస్తూ అతి తక్కువ కాలంలోనే న్యూస్ ప్రజెంటర్‌గా పాపులర్ అయింది. ఇక హౌజ్‌లోకి వచ్చిన దేవి.. వస్తూనే విజేతను అవుతానని నమ్మకంగా చెప్పింది. నేచర్ డిజాస్టర్, బ్లాంబ్ బ్లాస్ట్ లాంటివి కవర్ చేయడం ఇష్టం అని చెప్పుకొచ్చింది. కానీ వాటికంటే బిగ్‌బాస్ భ‌యంగా ఉందంటోంది. భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న ఆమెకు ప్ర‌స్తుతం ఆరేళ్ల బాబు ఉన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో లేడీ బిగ్‌బాస్ లేదు కాబ‌ట్టి త‌నే విన్న‌ర్ అవాల‌నుకుంటున్నాన‌ని మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చింది. డ‌బ్బు కోస‌మే బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చాన‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement