సోహైల్‌, దివికి చిరంజీవి బంపరాఫ‌ర్‌

Bigg Boss 4 Telugu: Chiranjeevi Special Gifts To Sohel, Sohel, Divi - Sakshi

పెద్ద హీరోల‌ది పెద్ద మ‌న‌సని చాటి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సాక్షిగా కంటెస్టెంట్ల ఆశ‌యాల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ వారికి సాయం చేశారు. గ్రాండ్ ఫినాలేకు ప్ర‌త్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ త‌న మాట‌లు, పంచ్‌ల‌తో షోను మ‌రో మెట్టు పైకి ఎక్కించారు. అలాగే బిగ్‌బాస్ సాక్షిగా యువ టాలెంట్‌ను ప్రోత్స‌హించేందుకు కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు క‌నిపించింది. ఈ క్ర‌మంలో సోహైల్‌కు ఏం కావాలో కోరుకోమ‌ని అడిగారు. దానికి అత‌డు త‌ను తీయ‌బోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావాల‌ని ఆహ్వానించాడు. ఇది స‌రిపోద‌నుకున్న చిరు ఏకంగా అత‌డి సినిమాలో న‌టిస్తాన‌ని కోట్లాది మంది ప్రేక్ష‌కుల సాక్షిగా మాటిచ్చారు. అంతేకాకుండా ఆ సిని‌మా ప్ర‌మోష‌న్ బాధ్య‌త కూడా భుజాన వేసుకున్నారు. ఇక దివికి త‌న నెక్స్ట్ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్ ఇస్తున్న‌ట్లు తెలిపారు.

న‌న్ను నేను చూసుకున్న‌ట్లుంది: చిరు
మెహ‌బూబ్ గురించి మాట్లాడుతూ.. అత‌డిని చూస్తుంటే చిన్న‌ప్పుడు త‌నను తాను చూసుకున్న‌ట్లుంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రావాల‌ని నా చిన్న‌ప్పుడు ఎలా త‌ప‌న చెందానో అది నీలో క‌నిపిస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా నాగార్జున క‌ల‌గ‌జేసుకుని సోహైల్ గెలుచుకున్న డ‌బ్బు గురించి ప్ర‌స్తావించారు. 'సోహైల్‌ అందుకున్న 25 ల‌క్ష‌ల రూపాయ‌ల్లో అనాథ‌శ్ర‌మానికి రూ.5 ల‌క్ష‌లు మెహ‌బూబ్ ఇంటి కోసం రూ.5 ల‌క్ష‌లు ఇస్తాన‌న్నాడు. అయితే మెహ‌బూబ్ మాత్రం దాన్ని తిర‌స్క‌రించాడు. త‌న‌కివ్వాల‌నుకున్న‌దాన్ని కూడా అనాథ‌శ్ర‌మానికి ఇచ్చేయ‌మ‌ని సూచించాడు' అని వివ‌రించారు. (చ‌ద‌వండి: 25 లక్షలకు సోహైల్‌ టెంప్ట్‌)

సోహైల్‌కు మ‌రో ప‌ది ల‌క్ష‌లిచ్చిన నాగ్‌
అయితే సోహైల్ గెలుచుకున్న మొత్తాన్ని అత‌డి కోస‌మే వాడుకోవాల‌‌ని నాగ్‌ సూచించారు. అత‌డు దానం చేద్దామ‌నుకున్న ప‌ది ల‌క్ష‌ల‌ను త‌న జేబులో నుంచి ఇస్తాన‌ని నాగ్ ప్ర‌క‌టించారు. దీంతో నాగార్జున‌ను ప్రేర‌ణ‌గా తీసుకున్న చిరంజీవి మెహ‌బూబ్‌కు అవ‌స‌ర‌మ‌య్యే డ‌బ్బు నేనిస్తాను అంటూ స్టేజీ మీద‌నే రూ.10 ల‌క్ష‌ల చెక్ రాసిచ్చారు. మెగాస్టార్ త‌న‌కు చెక్ రాసివ్వ‌డాన్ని న‌మ్మ‌లేక‌పోయిన మెహ‌బూబ్ ఉద్వేగానికి లోన‌య్యాడు. ఏడ్చుకుంటూ వ‌చ్చి ఆయ‌న కాళ్ల మీద ప‌డ్డాడు. దీంతో చిరంజీవి అత‌డిని ఓదార్చుతూ.. మీరు క‌ళాకారుల‌య్యా.. క‌ళాకారులు క‌న్నీళ్లు పెట్టకూడ‌దు అంటూ ద‌గ్గ‌ర‌కు చేర‌దీసి హ‌త్తుకున్నాడు. అత‌డికి ప్రేమ‌గా ముద్దు పెట్టి ప‌ది ల‌క్ష‌ల చెక్ ఇచ్చారు.  మొత్తానికి సోహైల్ సినిమాలో నటిస్తాన‌న‌డం, దివికి సినిమా ఛాన్స్‌, మెహ‌బూబ్‌కు చెక్ ఇవ్వ‌డం మెగాస్టార్ ప్ర‌త్యేక‌త‌ను చాటుతున్నాయి. మ‌న‌సున్న మారాజుగా ఆయ‌న్ను అభిమానుల గుండెల్లో నిల‌బెట్టాయి.(చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నెర‌వేరుతున్న గంగ‌వ్వ క‌ల‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top