అఖిల్‌కు మా త‌డాఖా చూపిస్తాం: అభి ఫ్యాన్స్‌

Bigg Boss 4 Telugu: Abhijeet Fans Trolling Akhil - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు చేసే‌ రచ్చ క‌న్నా వారి అభిమానులు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మ‌రీ దారుణంగా ఉంటుంది. అభిమాన కంటెస్టెంటును వెన‌కేసుకు రావ‌డం క‌న్నా, ఇత‌రుల మీద ప‌డి ట్రోలింగ్ చేయ‌డ‌మే వీళ్లు ముఖ్య‌మైన ప‌నిగా పెట్టుకున్నారు. రెండో సీజ‌న్‌లో కౌశ‌ల్ ఆర్మీ నెట్టింట ఎంత హ‌డావుడి చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ సీజ‌న్‌లో మాత్రం అందరిక‌న్నా ఎక్కువ‌గా అభిజిత్ పేరుతో ఏర్పాటైన ఆర్మీలు ఏకంగా సోష‌ల్ మీడియాను ఆక్ర‌మించుకున్న‌ట్లే క‌నిపిస్తున్నాయి. అయితే అభి త‌ప్పు చేసినా, ఒప్పు చేసినా, ప‌ని చేసినా, చేయ‌క‌పోయినా.. ఇలా ప్ర‌తిదాన్ని గుడ్డిగా వెన‌కేసుకొస్తున్నాయి. హౌస్‌లో అభి మీద ఈగ వాలినా బ‌య‌ట వీళ్లు చేసే హ‌డావుడి మామూలుగా ఉండ‌టం లేదు.

అఖిల్‌కు ఆక్సిజ‌న్‌లా మారిన సీక్రెట్ రూమ్‌
ఈ విష‌యాన్ని కాసేపు పక్క‌న పెడితే ఈ సీజ‌న్‌లో ప్ర‌స్తుతం ప‌దోవారం కొన‌సాగుతోంది. ఇంకా ఐదువారాల ఆట మాత్ర‌మే మిగిలి ఉంది. ప్ర‌స్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఒక‌రైన అఖిల్ ఫేక్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే నిజంగానే త‌న ప్ర‌యాణం ముగిసిందేమోన‌ని ఒక్క క్ష‌ణం గుండె ఆగిన అఖిల్‌కు బిగ్‌బాస్.. సీక్రెట్ రూమ్ అనే ఆక్సిజ‌న్ అందించాడు. దీంతో హ‌మ్మ‌య్యా.. నా బెర్త్ ఎక్క‌డికి పోలేద‌ని గుండెల‌మీద చెయ్యేసుకున్నాడు. అయితే ఈ ర‌హ‌స్య గ‌దిలో కేవ‌లం ఇంటిస‌భ్యులు ఏం మాట్లాడుకుంటారో ఆ క్లిప్పింగులు చూస్తూ గ‌డిపేయ‌డ‌మేన‌నుకున్నాడు. కానీ సోహైల్ మాట‌లో చెప్పాలంటే క‌థ వేరే ఉంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: హోస్ట్‌, గెస్ట్‌గా తండ్రీకొడుకులు)

అభికి లెట‌ర్ వ‌చ్చిందా? లేదా?
కంటెస్టెంట్లకు వ‌చ్చిన లెట‌ర్ల‌ను పంపించి వారిని సంతోష‌ర్చ‌డం లేదా, వాటిని తునాతున‌క‌లు చేసి బాధ‌ప‌ర్చ‌డం అంతా అఖిల్ చేతిలోనే ఉందని బిగ్‌బాస్ స్ప‌ష్టం చేశాడు. ఈ క్ర‌మంలో త‌న స్నేహితుల‌కు లెట‌ర్స్ పంపి వారి ముఖంలో న‌వ్వులు చూసి అఖిల్‌ సంతోష‌ప‌డుతున్న‌ట్లు ప్రోమోలో స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే అభిజిత్ కోసం వ‌చ్చిన‌ లెటర్‌ను హౌస్‌లోకి చేర‌వేశాడా? లేదా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అభిజిత్ మాత్రం త‌న ఎదుట కాగిత‌పు ముక్క‌ల‌ను క‌లిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. దీన్ని బ‌ట్టి అభికి లెట‌ర్ రాలేద‌ని ఆయ‌న అభిమానులు ఫీల‌వుతున్నారు. దీంతో అఖిల్‌ను క‌రివేపాకుతో పోల్చుతూ అత‌డి మీద మండిప‌డుతున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అఖిల్‌కు ఏమైంది?)

నిజ‌మేంటో తెలీకుండానే ట్రోలింగ్‌
ఒక‌వేళ అభి చేతికి లెట‌ర్ అంద‌క‌పోతే అఖిల్‌ను ఆ దేవుడు కూడా కాపాడ‌లేర‌ని వార్నింగ్ ఇస్తున్నారు. 'ఇప్ప‌టికే నామినేట్ చేసి త‌ప్పు చేశావు, ఇప్పుడు లెట‌ర్ ఇవ్వ‌కుండా మ‌రో త‌ప్పు చేస్తావా? అయినా మీరు ఎన్ని వేషాలు అభి ఇంకా స్ట్రాంగ్ అవుతాడు" అని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అంద‌రికీ లేఖ‌లు పంపిచ‌డానికి వీల్లేద‌ని బిగ్‌బాస్ ష‌రతు పెట్టి ఉండొచ్చేమోన‌ని అఖిల్ అభిమానులు అత‌డిని వెన‌కేసుకొస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ప్రోమోను చూసి త‌ప్పులో కాలేయ‌కండ‌ని, అభికి కూడా లెట‌ర్ వ‌స్తుంద‌ని ఆశించండి అని సానుకూలంగా ఆలోచించ‌మ‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఎపిసోడ్ చూడ‌కుండా ఒక‌ర్ని ట్రోల్ చేయ‌డ‌మేంట‌ని తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా అత‌డికి లెట‌ర్ అంద‌లేదేమోన‌న్న ఆలోచ‌న‌కే సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంటే ఇక ఎపిసోడ్‌లో అదే నిజ‌మైతే, అఖిల్‌ను ఏ రేంజ్‌లో ఆడుకుంటారో! అఖిల్ కూడా త‌న చ‌ర్య‌ను ఎలా స‌మ‌ర్థంచుకుంటాడో చూడాలి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top