వీడియో కాల్‌తో బట్టబయలైప మోనాల్‌-అఖిల్‌ నిక్‌ నేమ్స్‌

Bigboss Fame Akhil Calls Monal As Gujju In A Video Cal Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-4లో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న జంట మోనాల్‌-అఖిల్‌. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉన్న మోనాల్‌ ఆ తర్వాత అఖిల్‌కు దగ్గరవడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం.. సీజన్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచాయి. దీంతో ఎపిసోడ్‌లో ఎక్కువభాగం వీరి గురించే ప్రసారం చేసేవారు. అలా ముగ్గురికి బాగానే పాపులారిటీ దక్కింది. సాధారణంగా ఈ క్లోజ్‌నెస్‌ అంతా కేవలం సీజన్‌ వరకే పరిమితమయ్యేది. ఆ తర్వాత ఎవరి బిజీలో వాళ్లు ఉండటం, షో నుంచి బయటికొచ్చాక ఆ సాన్నిహిత్యం ఉండేది కాదు. కానీ మోనాల్‌- అఖిల్‌ మాత్రం హౌస్‌ నుంచి బయటకు వచ్చకా కూడా తరుచూ అఖిల్‌ని కలవడం, ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవడం, ఫోటోలకు ఫోజులివ్వడం చేసేవాళ్లు దీంతో నిజంగానే వాళ్లమధ్య ఏదో ఉందని బయట టాక్‌ నడుస్తుండేది.

ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్‌లో పడేసేవారు ఈ క్యూట్‌ కపుల్‌. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరు లేటెస్ట్‌గా వీడియో కాల్‌ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి స్ర్కీన్‌ షాట్లను అఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ 'గుజ్జు' అంటూ మోనాల్‌ని ముద్దుగా సంబోధించాడు. దీనికి మోనాల్‌ కూడా 'అఖిలూ'.. అంటూ ప్రేమగా పిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్ర్కీన్‌ షాట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. త్వరలోనే వీరు ఆఫ్‌ స్ర్కీన్‌ జోడీగా కనిపించినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు అఖినాల్‌ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్‌, మోనాల్‌ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.  

చదవండి : Bigg Boss 5 Telugu: నాగ్‌ ఔట్‌.. హోస్ట్‌గా యంగ్‌ హీరో!
హైదరాబాదీని అయిపోయా.. మోనాల్‌ ఆసక్తికర పోస్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top