ప్రేక్షకులు మరోసారి నిరూపించారు | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు మరోసారి నిరూపించారు

Published Mon, Jun 26 2023 3:45 AM

Bheemadevarapally Branchi Movie Success Meet - Sakshi

‘బలగం’ ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్ , సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. డా బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌కు అతిథిగా హాజరైన దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ప్రజల జీవన విధానాలను, వారి ఎమోషన్స్ను బేస్‌ చేసుకుని కథ సిద్ధం చేసుకుంటే సక్సెస్‌ వస్తుందని ప్రేక్షకులు మరోసారి నిరూపించిన చిత్రమిది’’ అన్నారు.

‘‘ఇలాంటి కథలు మన జీవితాలను ప్రపంచానికి తెలియజేస్తాయి’’ అన్నారు ‘బలగం’ ఫేమ్‌ సుధాకర్‌రెడ్డి. ‘‘‘బలగం’ తరహాలోనే ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా మంచి విజయం సాధించింది’’ అన్నారు తెలంగాణ బీసీ కార్పొరేషన్  ఛైర్మన్  వకుళాభరణం కృష్ణమోహన్ రావు. ‘‘నేటివిటీతో కూడిన మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రం ఇది. ఈ సినిమాపై మాకు ఉన్న నమ్మకం వమ్ము కాలేదు’’ అన్నారు నిర్మాతలు.

Advertisement
 
Advertisement
 
Advertisement