breaking news
Bheemadevarapally Branchi Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన ఆ సినిమా.. మరో తెలంగాణ పల్లె కథ!
తెలుగు సినిమాల్లో తెలంగాణ కల్చర్ పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో బలగం, మేమ్ ఫేమస్, పరేషాన్.. ఇలా వెంటవెంటనే పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. బాగానే ఎంటర్ టైన్ చేశాయి. ఇక ఈ లిస్టులోనే ఉన్న మరో చిత్రం 'భీమదేవరపల్లి బ్రాంచి'. జూన్ నెల చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) కథేంటి? తెలంగాణలో భీమదేవరపల్లి అనే పల్లెటూరు. ఉండేవాళ్లకు పెద్దగా చదువు రాదు. ఎవరైనా ఏదైనా చెబితే ఇట్టే నమ్మేస్తారు. ఇదే ఊరిలో జంపన్న(అంజి వల్గుమాన్) బ్యాంక్ అకౌంట్ లో ఓరోజు రూ.15 లక్షలు వచ్చిపడతాయి. ప్రభుత్వం తనకు ఈ డబ్బు ఇచ్చిందని, తనకున్న అప్పులన్నీ తీర్చేస్తాడు. దీంతో ఊరిలో వాళ్లందరూ ఇలా అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ డబ్బు ఎవరివి? అనేది తెలియాలంటే 'భీమదేవరపల్లి బ్రాంచి' చూసేయాల్సిందే. ఇప్పటికే స్ట్రీమింగ్ థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన ఈ సినిమా.. జనాలకు పెద్దగా తెలియకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 8 నుంచి అంటే మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏదైనా కొత్త సినిమా చూద్దామనే ఆసక్తి ఉంటే దీన్ని ప్రయత్నించొచ్చు. అలానే ఈ వారం దాదాపు 20కి పైగా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. అవేంటనేది కూడా కింద లింక్ చేసి చూసేయండి. మీ వీకెండ్‌ని ఫర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
ప్రేక్షకులు మరోసారి నిరూపించారు
‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్ , సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. డా బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్కు అతిథిగా హాజరైన దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ప్రజల జీవన విధానాలను, వారి ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని కథ సిద్ధం చేసుకుంటే సక్సెస్ వస్తుందని ప్రేక్షకులు మరోసారి నిరూపించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘ఇలాంటి కథలు మన జీవితాలను ప్రపంచానికి తెలియజేస్తాయి’’ అన్నారు ‘బలగం’ ఫేమ్ సుధాకర్‌రెడ్డి. ‘‘‘బలగం’ తరహాలోనే ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా మంచి విజయం సాధించింది’’ అన్నారు తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు. ‘‘నేటివిటీతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ఈ సినిమాపై మాకు ఉన్న నమ్మకం వమ్ము కాలేదు’’ అన్నారు నిర్మాతలు. -
'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమా రివ్యూ
టైటిల్: భీమదేవరపల్లి బ్రాంచి నటీనటులు: అంజి వల్గుమాన్, సాయి ప్రసన్న, రాజవ్వ తదితరులు నిర్మాణ సంస్థ: ఏబీ సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: బత్తిని కీర్తిలత, రాజ నరేందర్ దర్శకత్వం: రమేష్ చెప్పల సంగీతం: చరణ్ అర్జున్ సినిమాటోగ్రఫీ: కె.చిట్టిబాబు ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి విడుదల తేదీ: 2023 జూన్ 23 టాలీవుడ్ లో ఈ మధ్య తెలంగాణ కల్చర్ ఆధారంగా తీస్తున్న సినిమాల పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 'బలగం' లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. 'మేమ్ ఫేమస్' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేసింది. అదే 'భీమదేవరపల్లి బ్రాంచి'. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? తెలంగాణలోని భీమదేవరపల్లి అనే పల్లెటూరు. జనాలు పూర్తిగా నిరక్షరాస్యులు. ఎవరైనా చదువుకున్నోడి వచ్చి ఏదైనా చెబితే అదే నిజమని నమ్మేంత అమాయకులు. కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ తెరవమని చెప్పగానే ఊరిలోని అందరూ వాటిని తీసుకుంటారు. తమ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందనే పుకారుని నమ్మేస్తారు. కొన్ని రోజుల తర్వాత అదే ఊరిలో డప్పు కొట్టుకుని బతికే జంపన్న(అంజి వల్గుమాన్) ఖాతాలో రూ.15 లక్షలు వచ్చి పడతాయి. అప్పటికే అప్పులతో సతమవుతున్న జంపన్న.. ఈ డబ్బులతో ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే.. 'భీమదేవరపల్లి బ్రాంచి' స్టోరీ. ఎలా ఉందంటే? కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెబుతుంది. జంపన్న అలానే చేస్తాడు. ప్రభుత్వం ఆ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తుందనే పుకారు నిజమే అనుకుంటాడు. కొన్నిరోజులకు జంపన్న తల్లి అకౌంట్ లో ఆ డబ్బులు పడతాయి. మనోడు ఎంత అమాయకుడంటే.. 'మా అమ్మ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. నాది, నా భార్య అకౌంట్ లో కూడా డబ్బులు వేయండి' అని ఏకంగా ప్రధానిమంత్రికి లేఖ రాస్తాడు. ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. ఓవైపు నవ్విస్తూనే.. ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత పథకాల వల్ల ప్రజలు ఎలా సోమరిపోతులు అవుతున్నారనే విషయాన్ని సెటైరికల్ గా చూపించారు. ఫస్టాప్ విషయానికొస్తే.. భీమదేవరపల్లి ఊరిలో మనుషులు, వాళ్లెంత అమాయకులో చూపించారు. జంపన్న క్యారెక్టర్, అతడి ఫ్యామిలీ గురించి సీన్ బై సీన్ చూపించారు. కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ తెరుచుకోమని చెప్పడం.. దీంతో ఊరి జనాలందరూ బ్రాంచికి వెళ్లి ఖాతాలు ఓపెన్ చేసుకోవడం, ఆ ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 లక్షలు వేస్తుందనే రూమర్ నమ్మడం.. ఇలా తొలి భాగమంతా మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ లోనూ అసలు స్టోరీ ఉంటుంది. ఖాతాలో వేసిన డబ్బుని జంపన్న ఖర్చు చేసేయడం వల్ల ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు. చివరకు ఏం తెలుసుకున్నాడు లాంటి పాయింట్స్ తో సినిమాను ఎండ్ చేశారు. ఫస్టాప్ ని బాగా తీసిన డైరెక్టర్.. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఎందుకో కాస్త డల్ అయిపోయాడు. ఎమోనషల్ గా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే స్కోప్ ఉన్నప్పటికీ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. కొన్ని సీన్స్ మరీ సినిమాటిక్ గా ఉన్నట్లు అనిపిస్తాయి. వాటిని చూసినప్పుడు.. ఇలాంటి నేచురలిస్టిక్ సినిమాల్లో అలాంటి సన్నివేశాలు లేకపోతే బెటర్ అనే విషయాన్ని దర్శకుడు ఎందుకు మరిచిపోయాడబ్బా అనిపిస్తుంది. ఎవరెలా చేశారు? అంజి వల్గుమాన్, జంపన్న పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ముందు ఒకలా, చేతికి డబ్బు వచ్చిన ఒకలా బిహేవ్ చేయడం లాంటి సీన్స్ లో బాగా నటించి అలరించాడు. జంపన్న భార్యగా నటించిన సాయిప్రసన్న, లేటు వయసులో పెళ్లి కోసం కలలు కనే వ్యక్తిగా 'బలగం' సుధాకర్ రెడ్డి, లింగం పాత్రలో గడ్డం నవీన్ ఇలా అందరూ తమ తమ రోల్స్ కి న్యాయం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జేడీ లక్ష్మీ నారాయణ, అద్దంకి దయాకర్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఇక చరణ్-అర్జున్ సినిమాకు సరిపోయే సంగీతమిచ్చారు. చిట్టిబాబు సినిమాటోగ్రఫీ బాగుంది. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ ఓకే. ఊరిలోని సీన్స్ కొన్ని ట్రిమ్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు.