అబ్బాయిలు ఇడియట్స్‌.. అప్పటిదాకా ఆగి పెళ్లి చేసుకోండి: నటుడు | Arjun Rampal: Gabriella Demetriades is Very Close To My Ex Wife | Sakshi
Sakshi News home page

చిన్న వయసులోనే పెళ్లి.. అందుకే విడాకులు.. తప్పంతా నాదే!: భగవంత్‌ కేసరి నటుడు

Jul 31 2024 4:36 PM | Updated on Jul 31 2024 5:09 PM

Arjun Rampal: Gabriella Demetriades is Very Close To My Ex Wife

చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందంటున్నాడు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. నేను విచ్ఛిన్నమైన కుటుంబం నుంచి వచ్చాను. అక్కడ బంధాలు తెగిపోవడమే చూశాను. కానీ ఎందుకలా జరుగుతున్నాయనేది అర్థం చేసుకోలేకపోయాను. నాదాకా వస్తే కానీ అన్నీ అవగతం కాలేదు. అయినా విడాకులు తీసుకోవడానికి పూర్తి బాధ్యత నాదే! 

నాది చిన్న వయసు
నాకు 24 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసుకోవడానికి అది చాలా చిన్న వయసు. ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉంటాయి. పూర్తిగా మెచ్యూరిటీ వచ్చాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలి. అమ్మాయిల కన్నా అబ్బాయిలు చాలా నెమ్మదిగా పరిణతి చెందుతారు. మేము ఇడియట్స్‌ అని ఇక్కడే తెలిసిపోతోంది. మూడుముళ్ల బంధం విజయవంతం కావాలంటే ఆ సమయం వచ్చేదాకా ఆగిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి.

పెళ్లి- విడాకులు
పెళ్లనేది కేవలం ఒక పేపర్‌ ముక్కలాంటిదే. నా దృష్టిలో నా ప్రియురాలు గాబ్రియెల్లాకు, నాకు పెళ్లయిపోయినట్లే. తనతో నా మాజీ భార్య ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. పిల్లలందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. ఈయన 1998లో నిర్మాత మెహర్‌ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి మహిక, మైరా అనే ఇద్దరు కూతుర్లు జన్మించారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నారు.

సినిమాలు..
అదే సంవత్సరం నటి గాబ్రియెల్లా డెమట్రియాడెస్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించడంతో పాటు వీరికి ఒక బాబు పుట్టాడు. 2023లో మరోసారి బాబు జన్మించాడు. బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన ఇతడు భగవంత్‌ కేసరి మూవీతో గతేడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ద బ్యాటిల్‌ ఆఫ్‌ కొరెగావ్‌, నాస్తిక్‌, 3 మంకీస్‌, దురంధర్‌ మూవీస్‌ చేస్తున్నాడు.

చదవండి: రూ.3 లక్షలిస్తేనే ప్రమోషన్స్‌.. హీరోయిన్‌పై నిర్మాత ఫైర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement