ఇప్పుడదే ఫేవరెట్‌ అంటున్న అనుష్క శర్మ

Anushka Sharma Post Pregnancy P​hoto Viral - Sakshi

టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మల వివాహం 2017లో డిసెంబర్‌ 11న జరిగింది. మూడేళ్ల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది జనవరి 11న పండంటి పాప పుట్టింది. అప్పటి నుంచి కూతురికి సంబంధించిన ఏ విషయాన్ని అభిమానులతో పంచుకోని ఈ దంపతులు ఫిబ్రవరి 2న తొలిసారి వారి గారాల పట్టి ఫొటోను షేర్‌ చేశారు.

ప్రసవం తర్వాత తొలిసారిగా అనుష్క అద్దం ముందు నిల్చుని దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. పాపను ఎత్తుకునేందుకు ఉపయోగించే వస్త్రాన్ని భుజాన వేసుకున్న అనుష్క ఇప్పుడదే తన ఫేవరెట్‌ అని రాసుకొచ్చింది. ఈ ఫొటో చూసిన అభిమానులు ఒకింత నిర్ఘాతపోయారు. ప్రసవం తర్వాత కూడా ఇంత ఫిట్‌గా కనిపించడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విరుష్క దంపతులు వారి ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలు కలిసేలా తమ గారాలపట్టికి వామిక అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వామిక అంటే కనకదుర్గ అని అర్థం. న్యూమరాలజీ ప్రకారం పాపాయి వామికా లక్కీ నెంబర్‌ 3. కాగా విరుష్క అభిమానులు వామిక ముఖారవిందాన్ని ఎప్పుడు చూపిస్తారోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

చదవండి: ఒకే రోజు తల్లులైన అనుష్క, బబి

తొలిసారి కూతురి ఫొటో షేర్‌ చేసిన ‘విరుష్క’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top