తొలిసారి కూతురి ఫొటో షేర్‌ చేసిన ‘విరుష్క’

Anushka Sharma And Virat Kohli Shares Babys First Pic Reveal  Name - Sakshi

చిన్నారికి 'వామికా'గా నామకరణం

ముంబై: విరాట్‌-అనుష్క అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న వారి కూతురి ఫోటోను మొదటిసారిగా అనుష్క రివీల్‌ చేసింది. తమ ముద్దుల కుమార్తెకు ఈ జంట సోమవారం నామకరణం చేసింది. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా 'వామికా' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని నటి అనుష్క శర్మ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఎంతో ప్రేమానురాగాలతో నిండిన మా జీవితాల్లో వామికా ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక ఎన్నో వెలుగులను తీసుకొచ్చింది.  ఆనందం, కన్నీళ్లు, ఆందోళన..ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు. కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది.  మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు' అంటూ అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. (సంతోష సమయం.. చిన్న విన్నపం: విరుష్క)

కాగా‌ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ దంపతులకు జనవరి 11న పండంటి పాప జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ చిన్నారి గోప్యతకు భంగం కలగకుండా తనను సంరక్షించుకోవాలని భావిస్తున్నామని, తమ కుమార్తె ఫొటోలు తీయవద్దని  విరుష్క దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో  విరుష్కల కూతురు ఎలా ఉంటుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అనుష్క తమ చిన్నారి ఫోటో షేర్‌ చేయడంతో విరుష్క ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (ఆకతాయిలుగా పెంచాలనుకోవడం లేదు: అనుష్క)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top