Aaliyah Kashyap: ప్రియుడితో చెట్టాపట్టాల్‌.. నిశ్చితార్థం అయిపోయిందంటూ పోస్ట్‌

Anurag Kashyap Daughter Aaliyah Kashyap Engagement with BF Shane Gregoire - Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కూతురు ఆలియా కశ్యప్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. గత కొంతకాలంగా షేన్‌ గ్రెగోయిర్‌ ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఆలియా నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా తన ప్రేయసి వేలికి ఉంగరాన్ని తొడిగాడు షేన్‌. ఈ ఫోటోలను లవ్‌ బర్డ్స్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. ఇందులో తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని హైలైట్‌ చేసిన ఆలియా మరో ఫోటోలో ప్రియుడికి గాఢంగా ముద్దు పెట్టింది.

'మొత్తానికి మేము అనుకుంది జరిగింది. నా బెస్ట్‌ ఫ్రెండ్‌, నా పార్ట్‌నర్‌, నా సోల్‌మేట్‌ ఇప్పుడు నా భర్త అయ్యాడు. నా జీవితానికి దొరికిన అమూల్యమైన ప్రేమవు నీవే.. అసలు సిసలైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించినందుకు థ్యాంక్స్‌. నీ ప్రపోజల్‌కు ఎస్‌ చెప్పడం నేను చేసినవాటిలో అత్యంత సులువైన పని. నీతో జీవితాన్ని కొనసాగించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను ఫియాన్సీ అని పిలిచే రోజు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది ఆలియా.

కాగా ఆలియా- షేన్‌ గ్రెగోయిర్‌ 2020లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గతేడాది జూన్‌లో తమ ప్రేమకు రెండేళ్లు నిండటంతో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు షేన్‌. ఆలియాను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తూనే ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగే రోజు కోసం ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చాడు. ఎట్టకేలకు అనుకున్నది సాధించడంతో షేన్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు నెటిజన్లు.

చదవండి: రామ్‌ గోపాల్‌ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్‌ నటుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top