Rupali Ganguly: ఏంటీ బికినీనా.. ఆ విషయం నాకు తెలియదే! - Sakshi
Sakshi News home page

Rupali Ganguly: ఏంటీ బికినీనా.. ఆ విషయం నాకు తెలియదే!

Aug 28 2021 9:20 PM | Updated on Aug 29 2021 2:56 PM

Anupama actress Rupali Ganguly Counter On Her Pool Photo - Sakshi

స్విమ్మింగ్‌పూల్‌లో కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటో షేర్‌ చేసిన నటి.. ఆ తర్వాత

ముంబై: నవ్వుతూనే వెన్నుపోటు పొడిచే వాళ్లు ఎక్కువయ్యారంటూ హిందీ టీవీ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ రూపాలి గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలు ఎందుకు రాస్తారంటూ మీడియాను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. థియేటర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ఆరంభించిన రూపాలి గంగూలీ.. స్టార్‌ ప్లస్‌ సీరియళ్లతో నటిగా గుర్తింపు పొందారు. బిగ్‌బాస్‌ హిందీ సీజన్‌- 2006లో పాల్గొన్న ఆమెకు ఇన్‌స్టాలో 10 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు.

ఇక ఎప్పటికప్పుడు తన అప్‌డేట్లతో అభిమానులను అలరించే రూపాలి బుధవారం ఓ ఫొటోను షేర్‌ చేశారు. తన కొడుకు రుద్రాక్ష పుట్టిన రోజు సందర్భంగా భర్త అశ్విన్‌తో కలిసి లోనావాలకు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో కొడుకును ఎత్తుకుని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఈ క్రమంలో కొన్ని ఎంటర్‌టైన్‌మెంటు చానెళ్లు.. బికినీలో రూపాలి గంగూలీ చాలెంజ్‌ అంటూ వార్తలు రాశాయి. ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆమె.. ‘‘నా దగ్గర బికినీ ఉందని నాకే తెలియదు!! నాకంటే నా గురించి మీకే ఎక్కువగా తెలుసు. రాంగ్‌ రిపోర్టింగ్‌’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడం సరికాదని హితవు పలికారు. అయితే, ఈ విషయంలో అభిమానులు రూపాలికి మద్దతు పలుకుతుండగా, కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె తీరును విమర్శిస్తున్నారు. కాగా స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే అనుపమ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ పోషించిన రూపాలి.. కుటుంబం కోసం తన ఆశలు, ఆశయాలు త్యాగం చేసి మంచి గృహిణిగా, తల్లిగా పేరు తెచ్చుకునే క్యారెక్టర్‌లో జీవించారు. ఎంతగా ఒదిగి ఉన్నా భర్త సంతృప్తి పొందకపోగా తనను పదే పదే విమర్శిస్తుండటంతో అస్థిత్వం కోసం ఎంతదాకానైనా వెళ్లేందుకు సిద్ధమంటూ ఆత్మాభిమానం చాటుకునే పాత్రలో మెప్పించి మంచి మార్కులు కొట్టేశారు.

చదవండి: ప్రభాస్‌ అస్సలు అలాంటి వాడు కాదు: కృతి సనన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement