వర్షం సినిమా చూశాక అమ్మలో సంతోషం.. మళ్లీ ఇప్పుడా పరిస్థితి | Anni Manchi Sakunamule movie success meet | Sakshi
Sakshi News home page

వర్షం సినిమా చూశాక అమ్మలో సంతోషం.. మళ్లీ ఇప్పుడా పరిస్థితి

May 21 2023 4:29 AM | Updated on May 21 2023 7:45 AM

Anni Manchi Sakunamule movie success meet - Sakshi

స్వప్నా దత్, నందినీ, ప్రియాంకా దత్, మాళవిక, సంతోష్‌

‘‘అన్నీ మంచి శకునములే’ కుటుంబమంతా కూర్చొని చూసే సినిమా. ఇంకా చూడనివారు థియేటర్స్‌కి వెళ్లి చూడండి. మా బ్యానర్‌లో ఇంతకుముందు వచ్చిన చిత్రాల్లానే ‘అన్నీ మంచి శకునములే’ వంటి ఓ మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది’’ అని నిర్మాత ప్రియాంకా దత్‌ అన్నారు. సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో నిర్మాత స్వప్నా దత్‌ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత ట్రెండ్‌లోనూ ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది. మా బ్యానర్‌లో నటించిన ఎన్టీఆర్, నాని, విజయ్‌ దేవరకొండ మంచి స్టార్స్‌ అయ్యారు.. అలాగే సంతోష్‌కి కూడా ఆ రేంజ్‌ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా అంటే కేవలం మాస్‌ కాదు.. ఫ్యామిలీ అంతా చూడగలిగే సినిమా ఇది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘20 ఏళ్ల క్రితం నాన్నగారు (డైరెక్టర్‌ సంతోష్‌) తీసిన ‘వర్షం’ సినిమా చూశాక మా అమ్మలో సంతోషం చూశాను. ఇప్పుడు ‘అన్నీ మంచి శకునములే’ మా అమ్మలో అదే ఆనందం తీసుకువచ్చింది’’ అన్నారు సంతోష్‌ శోభన్ .

Advertisement
 
Advertisement
Advertisement