శ్రీలీల 6 సినిమాలు చేస్తోంది.. మీరేమో.. అంజలి రిప్లై ఇదే! | Sakshi
Sakshi News home page

Anjali: 'మొన్నొచ్చిన శ్రీలీల దూకుడు చూపిస్తోంది.. మీరేమో..' అంజలి ఆన్సర్‌ ఇదే!

Published Sun, Jan 7 2024 5:10 PM

Anjali Superb Reply To a Journalist Question Who Compared with Sreeleela - Sakshi

తెలుగు హీరోయిన్‌ అంజలి ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో గీతాంజలి(2014) ఒకటి. పదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా తెరకెక్కింది. అంజలితో పాటు సత్యం రాజేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి, షకలక శంకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 'నిన్ను కోరి' సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు.

శ్రీలీలతో పోలిక​.. అంజలి చిరాకు
ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్‌ అంజలిని ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగింది. 'తెలుగువారికి మీరంటే చాలా అభిమానం. నేను కూడా మీకు పెద్ద అభిమానిని. అయితే మీకు ఇంతవరకు సరైన బ్రేక్‌ రాలేదని అనిపిస్తోంది. తెలుగమ్మాయి అవడం వల్ల బ్రేక్‌ రాలేదా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా?' అని అడిగింది. దీనికి అంజలి బదులిస్తూ.. 'నాకు బ్రేక్‌ రాకపోతే మీకు ఫేవరెట్‌ హీరో అయ్యేదాన్నే కాదు' అని చెప్పింది. దీనికి సదరు జర్నలిస్టు స్పందిస్తూ.. అలా అని కాదు.. ఈ రోజు శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తోంది. మీరేమో.. అని నసగడంతో అంజలి మధ్యలోనే అందుకుంది.

కిక్‌ ఉంటేనే చేస్తా
'నేనెప్పుడూ ఒకటి, రెండు స్థానాల కోసం పోటీపడలేదు. ఒక్కొక్కరికి ఒక్కో హీరోయిన్‌ నచ్చుతారు. నాకు స్క్రిప్ట్‌ నచ్చితేనే, అందులోనూ నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఉంటేనే ఆ సినిమా చేస్తాను. లేదంటే ఆ పాత్ర ఒప్పుకోను. నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేయొచ్చు. కానీ నాలుగింటికి బదులు ఒక్క మంచి సినిమా చేయడమనేది నాకిష్టం. నేను తెలుగుతో పాటు ఇతర మూడు భాషల్లోనూ నటిస్తున్నాను. ఒకేసారి అన్ని చోట్లా నేను ఉండలేను. అక్కడో సినిమా, ఇక్కడో సినిమా చేస్తున్నాను. నాకు కిక్కిచ్చే పాత్రలే చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది అంజలి.

చదవండి: సీరియల్‌ నటి​ ప్రియాంకకు ఆపరేషన్‌.. గతంలో ఆమె ప్రియుడికి కూడా!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement