నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్‌ మూవీ | Anjali Starrer Geethanjali Malli Vachindi Movie Released In OTT, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Sat, May 11 2024 2:23 PM | Last Updated on Sat, May 11 2024 3:14 PM

Anjali Starrer Geethanjali Malli Vachindi Streaming On This OTT Platform

హారర్‌ సినిమాలకు ఓటీటీలో మంచి గిరాకీ ఉంటుంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి ఇలా ఎంటరవ్వగానే అలా ట్రెండయిపోతాయి. థియేటర్లలో పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టని చిత్రాలు కూడా మినిమమ్‌ గ్యారెంటీ వ్యూస్‌ రాబడతాయి. తాజాగా ఓ తెలుగు హారర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

గత నెలలో రిలీజ్‌
తెలుగు హీరోయిన్‌ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గీతాంజలి అనే హిట్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. కోన వెంకట్‌ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్‌, రవిశంకర్‌, సత్య, బ్రహ్మాజీ, అలీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సడన్‌గా ఈ చిత్రం ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.

కథ విషయానికి వస్తే..
దర్శకుడు శ్రీనివాస్‌(శ్రీనివాస్‌ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్‌ అవుతాయి. మరో ఛాన్స్‌ కోసం ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్‌లో తిరుగుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఊటీకి చెందిన వ్యాపారవేత్త విష్ణు (రాహుల్‌ మాధవ్‌) మేనేజర్‌ గోవిందా గోవిందా (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి తనతో సినిమా నిర్మిస్తానని చెపుతాడు. 

హీరోయిన్‌గా ఊటీలో కాఫీ కేఫ్‌ రన్‌ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అయితే షూటింగ్‌ అంతా సంగీత్‌ మహల్‌లోనే పూర్తి చేయాలని కండీషన్‌ పెడతాడు. అక్కడున్న దెయ్యాలతో శ్రీను టీమ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడే షూటింగ్‌ చేయాలని ఎందుకు కండీషన్‌ పెట్టాడు? గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా? ఎందుకు? వచ్చింది? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!

 

చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement