ముద్దు సన్నివేశాల్లో నటించడంపై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

Anjali : ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు అలా ఫీలవుతా

Published Wed, Jan 17 2024 2:00 PM

Anjali Comments On Intimate Scenes - Sakshi

తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం టాలీవుడ్‌లో కాకుండా కోలీవుడ్‌, మాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తూ..బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సహజంగా వస్తాయని, అందులో నటించక తప్పదన్నారు. అయితే అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుందని, కానీ కథ డిమాండ్‌ చేస్తే చేయక తప్పదన్నారు.

(చదవండి: రియల్‌ లైఫ్‌లో ఒక్కటి కానున్న రీల్‌ జంట!)

‘ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది..ఇంటిమేట్‌ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాను నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని అంజలి చెప్పారు.

(చదవండి: తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్‌ రాకపోవచ్చు: మహేశ్‌ బాబు)

ఇక తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌ గురించి స్పందిస్తూ.. ‘కొందరు నా పర్సనల్‌ విషయాల గురించి ఇష్టానుసారంగా రాసేస్తున్నారు. గతంలో జర్నీ నటుడు జైతో ప్రేమలో ఉన్నానని రూమర్స్‌ క్రియేట్‌ చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి అయిందని వార్తలు రాశారు. అవన్నీ రూమర్స్‌ మాత్రమే. వాటిని చూసి నవ్వుకుంటాను తప్ప సీరియస్‌గా తీసుకొను’అని అంజని చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం అంజలి రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ గేమ్‌ ఛేంజర్‌లో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.  2014లో ఆమె నటించిన గీతాంజలి సీక్వెల్‌  ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. వీటితో పాటు పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement