బోల్డ్ సీన్స్ చేశాక భావోద్వేగానికి గుర‌య్యాను: అంజ‌లి | Actress Anjali About Her Pushpa Role And Bold Scenes In Bahishkarana Web Series, Deets Inside | Sakshi
Sakshi News home page

Anjali: బోల్డ్ సీన్స్.. అందువల్లే కంఫర్ట్‌గా నటించగలిగా

Jul 25 2024 2:16 PM | Updated on Jul 25 2024 2:55 PM

Anjali About Her Pushpa Role in  Bahishkarana Web Series

హీరోయిన్‌ అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ బహిష్కరణ. ఈ సిరీస్‌ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రా అండ్ ర‌స్టిక్ డ్రామాకు ప్రేక్ష‌కులతో పాటు విమ‌ర్శ‌కుల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇందులో అంజలి పుష్ప అనే వేశ్య పాత్ర‌లో న‌టించింది. ఈ పాత్ర‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌పై అంజ‌లి స్పందిస్తూ.. ‘‘‘బహిష్కరణ’ సిరీస్‌లో పుష్ప పాత్ర‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో న‌టించ‌టాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే పుష్ప పాత్ర‌లో చాలా డెప్త్ ఉంది. ఆమె పాత్ర‌లో భావోద్వేగాలను చాలా శ‌క్తివంతంగా చూపించారు’’ అంది.

ఎమోషనల​ అయ్యా..
పాత్రకు త‌గ్గ‌ట్లు కొన్ని బోల్డ్ సీన్స్‌లో అంజ‌లి న‌టించింది. దాని గురించి మాట్లాడుతూ ప్రారంభంలో బోల్డ్ సీన్స్‌లో న‌టించ‌టం కాస్త ఇబ్బందిగా అనిపించింది. బోల్డ్ సీన్‌లో న‌టించిన త‌ర్వాత ఓసారైతే చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. అందుకు కార‌ణం, అలాంటి స‌న్నివేశంలో తొలిసారి నేను న‌టించ‌ట‌మే కారణం. బోల్డ్ సీన్‌లో నటించేందుకు ముందుగా సన్నద్ధం కాకపోయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని న‌టించాను. ఈ పాత్ర నాకు కొత్తే అయినా దాన్ని ఎలా చేయాల‌నే దానిపై నాకు అవ‌గాహ‌న ఉంది. 

జాగ్రత్త తీసుకున్నారు
నేను ఆ బోల్డ్ సీన్స్‌లో న‌టించేట‌ప్పుడు సెట్స్‌లో చాలా త‌క్కువ మంది మాత్రమే ఉన్నారు. ద‌ర్శ‌కుడు ఆ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకున్నారు. అందువ‌ల్ల నేను కంఫ‌ర్ట్‌గా న‌టించ‌గ‌లిగాను అని తెలిపింది. బహిష్కరణ సిరీస్‌ విషయానికి వస్తే.. రిలీజైన మూడు రోజుల్లోనే 35 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకుంది. ముఖేష్ ప్ర‌జాప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్‌ను ప్ర‌శాంతి మ‌లిశెట్టి రూపొందించారు. 

చదవండి: 70కి పైగా ఆడిషన్స్‌.. కాంప్రమైజ్‌ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement