రత్నమాల నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది: అంజలి | Sakshi
Sakshi News home page

రత్నమాల నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది: అంజలి

Published Mon, May 27 2024 12:21 AM

Anjali about Gangs of Godavari

‘‘నన్ను ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో చూడాలనుకుంటారు. కానీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో నేను చేసిన రత్నమాల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘ఈ పాత్రకు మీరే న్యాయం చేయగలరు’ అని కృష్ణచైతన్య అన్నారు. ఇంత మంచి పాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని అంజలి అన్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా, నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న  విడుదలవుతోంది.

ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘రత్నమాల పాత్ర కోసం ఈ తరహా (మాస్‌) సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. చిత్రీకరణ, డబ్బింగ్‌ సమయంలో కొత్త అనుభూతి పొందాను. రత్నమాల నా సినీ కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’’ అన్నారు. పెళ్లి గురించి అడిగితే –  ‘‘నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే’’ అన్నారు అంజలి. ‘‘ప్రస్తుతం ‘గేమ్‌ చేంజర్‌’లో ఓ కథానాయికగా చేస్తున్నాను. తెలుగులో మరో సినిమా, తమిళ, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు అంజలి.

Advertisement
 
Advertisement
 
Advertisement