జనం మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిన హీరోయిన్‌ | Andrea Jeremiah Stuck In Crowd | Sakshi
Sakshi News home page

జనం మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిన హీరోయిన్‌

Jan 20 2024 6:56 AM | Updated on Jan 20 2024 7:55 AM

Andrea Jeremiah Stuck In Crowd - Sakshi

అభిమానులు లేనిదే ఏ స్టార్‌ లేరులే అంటారు. అయితే ఒక్కోసారి స్టార్లను ఆ అభిమానులే ఇబ్బందులకు గురి చేస్తారు. దీనిని మితిమీరిన అభిమానం తెచ్చిపెట్టే తంటా అని కూడా పేర్కొనవచ్చు. ఆండ్రియా ఇటీవల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఆంగ్లో ఇండియన్‌ బ్యూటీ బహుభాషా నటి మాత్రమే కాకుండా బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణి, ఆండ్రియాలో మంచి నటి, గాయని, రచయిత వున్నారు. ఇక ఎలాంటి పాత్రలో నైనా నటించడానికి రెడీ అనే డేరింగ్‌ బ్యూటీ ఆమె. ప్రస్తుతం ఈమె నటించిన తమిళ చిత్రం పిశాచి–2 విడుదలకు సిద్ధమవుతోంది.

నటిగా రాణిస్తున్న ఆండ్రియా ఇటీవల పొంగల్‌ సందర్భంగా పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రతి ఏడాది కారైక్కాల్‌లో కార్నివాల్‌ వేడుకలను నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది పొంగల్‌ సందర్భంగా గత 14న ప్రారంభమైన ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు జరిగాయి. కార్యక్రమం ముగింపు రోజున నిర్వాహకులు ఆండ్రియాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఆమె వేదికపై ఊ అంటావా మామ ఊహూ అంటావా వంటి పాటలను పాడి ఆహూతులను, ప్రేక్షకులను అలరించారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు అంటూ అండ్రియాను చుట్టుముట్టారు. దీంతో ఆమె జనం మధ్య చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సురక్షితంగా అక్కడి నుంచి పంపించేశారు. అయినప్పటికీ అభిమానులు ఆమె వెంట పరుగులు తీశారు. దీంతో ఆండ్రియా కారు వేగంగా దూసుకుపోయింది. ఇలా సెలబ్రిటీలు తమపై వీరాభిమానాన్ని పెంచుకున్న ప్రజలను చూసి గర్వపడాలో లేక ఇలాంటి సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారిని చూసి బాదపడాలో అర్థం కాని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement