డైలాగ్స్‌ మర్చిపోతున్నా, అందువల్లే అనుకుంటా: బిగ్‌బీ

Amitabh Bachchan Said He Forgot Dialogues While Shoot - Sakshi

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ తాజాగా నటించిన చిత్రం ‘చెహ్రే’. అమితాబ్‌, ఇమ్రాన్‌ హిష్మీ ప్రధాన పాత్రలో సెస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని రేపు విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో తమ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత ఆనంద్‌ పండిట్‌, బిగ్‌బీ, ఇమ్రాన్‌ హష్మీలు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ నిర్వహించి సినిమా విశేషాలపై ముచ్చటించారు.

చదవండి: స్వరా భాస్కర్‌ గృహ ప్రవేశం.. షాకైన నెటిజన్లు

ఈ సందర్భంగా బిగ్‌బీ మాట్లాడుతూ.. ‘సినిమాలు మనల్ని ఉత్సాహరుస్తుంటాయి. కొత్త సినిమా, స్రిప్ట్‌ నా ద్గగరికి వచ్చిందంటే చాలు మొదట ఇందులో నా  పాత్ర, కథ ఏంటో తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపుతాను. దర్శకుడు రూమీ జాఫ్రీ చెహ్రే కథతో నా దగ్గరికి రాగానే నా పాత్ర గురించి చెప్పమన్నాను. అతడు వివరించాడు. నా పాత్ర, కథ బాగా నచ్చటంతో ఒకే చెప్పాను. ఇంతకాలం కామెడీ చిత్రాల్లో నటించిన నేను ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

చదవండి: మాస్క్‌ లేకపోతే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది : హీరోయిన్‌

ఇక ఇమ్రాన్‌ హష్మీ అమితాబ్‌ గురించి మాట్లాడుతూ.. సినిమా కోసం బిగ్‌బీ చేయాల్సిందంతా చేస్తారన్నాడు. ఆయన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారని చెప్పడంతో వెంటనే అమితాబ్ అలా న్యాయం చేయ‌క‌పోతే సినిమాను అవ‌మానించిన‌ట్టే అవుతుందన్నారు. అయితే స్క్రిప్ట్‌ను ఎక్కువ రిహార్స‌ల్స్ చేయడంపై ప్రస్తావన రావడంతో బిగ్‌బీ స్పందిస్తూ..  ఈ మధ్య తాను పెద్ద పెద్ద డైలాగ్‌లు గుర్తు పెట్టుకోలేకపోతున్నానని, ఎక్కడ మర్చిపోతానోనని పదే పదే రిహార్సల్‌ చేస్తున్నాని చెప్పారు. అంతేగాక వయసు రిత్యా మతిమరుపు పెరిగినట్టుంది అంటూ ఆయన చమత్కారించారు. కాగా ఈ వయసులో కూడా బిగ్‌బీ తన నటనతో యంగ్‌ హీరోలను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి ఆయన డైలాగ్‌లు మర్చిపోతున్నానని చెప్పడంతో అందరు షాక్‌ అవుతున్నారు. 

చదవండి: చిరు కోసం సల్మాన్‌.. ప్రభాస్‌ కోసం అమితాబ్‌, కొత్తగా టాలీవుడ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top